Wednesday 2 October 2019

Ram Charan: థ్యాంక్స్ డ్యాడీ.. BOSS BUSTER గిఫ్ట్ ఇచ్చావ్

మెగా అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసిన ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా భారీ అంచనాల మధ్య ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమా బ్లాక్ బస్టర్ విజయం అందుకుందని తెలుగు రాష్ట్రాల టాక్. బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుందని ముందు నుంచి అభిమానులు, చిత్రబృందం గట్టి నమ్మకంతో ఉంది. అనుకున్నట్లుగానే సినిమా బాక్సాఫీస్ వద్ద విజయ దుందుభి మోగిస్తోంది. ఈ సందర్భంగా మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవికి ధన్యవాదాలు తెలిపారు. ‘మాకు అన్నీ ఇచ్చిన వ్యక్తి. ఇంతటి బాస్ బస్టర్‌ను మాకు అందించినందుకు థ్యాంక్స్ నాన్నా’ అని పేర్కొంటూ ఆప్యాయంగా తన తండ్రిని కౌగిలించుకుంటున్న ఫొటోను పోస్ట్ చేశారు. తనపై నమ్మకం ఉంచి ఇంతటి భారీ బడ్జెట్ సినిమా తీసినందుకు చిరు కుమారుడిని ప్రేమగా ముద్దాడారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభిస్తోంది. అమెరికాలో ఇప్పటికే తెలుగు ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా సినిమాపై ప్రశంసల జల్లులు కురిపిస్తున్నారు. సినిమాలో చిరు పర్ఫామెన్స్ హైలైట్‌గా నిలిచిందని అంటున్నారు. తన 150 సినిమాల అనుభవం మొత్తం ఈ సినిమాలో కనబడిందని పొగిడేస్తున్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో చిరు జీవించేశారని కొనియాడుతున్నారు. ఈ సినిమాను తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళ భాషల్లోనూ విడుదల చేశారు. అటు హిందీలోనూ సినిమాకు మంచి స్పందన వస్తోంది. ‘బాహుబలి’ తర్వాత అంతటి స్థాయిలో తెరకెక్కిన సినిమా కావడంతో హిందీ ప్రేక్షకులు కూడా సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూశారు. సినిమాలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌ను తీసుకోవడం ప్లస్ పాయింట్ అయింది. నేటివ్ హీరో కూడా ఉంటే అక్కడి ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతారని చిత్రబృందం భావించింది. అందుకే కన్నడ నుంచి తమిళం నుంచి కూడా నేటివ్ నటీనటులకు సినిమాలో అవకాశం ఇచ్చారు. మొత్తానికి రామ్ చరణ్ తన తండ్రి 12 ఏళ్ల కలను నెరవేర్చడమే కాదు జీవితాంతం గుర్తుండిపోయేలా చేశాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2nw6pJf

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...