Wednesday, 23 October 2019

వివాదాస్పద నటుడితో నాని రెండో సినిమా

టాలీవుడ్‌ యంగ్ హీరో హీరోగా బిజీగా కొనసాగుతూనే నిర్మాతగా తను అభిరుచిని చాటుకునే పనిలో ఉన్నాడు. ఇప్పటికే సినిమాతో నిర్మాతగా మారిన ఈ యంగ్ హీరోగా కమర్షియల్‌గా విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకొని నిర్మాతగా మంచి పేరు తెచ్చుకున్నాడు. రొటీన్‌కు భిన్నంగా ఉండే సినిమాలనే నిర్మించాలనే ఉద్దేశంతో కొత్త దర్శకులను ప్రొత్సహిస్తున్నాడు. అ! తరువాత నిర్మాణరంగానికి కాస్త బ్రేక్‌ ఇచ్చిన నాని ఇప్పుడు తన వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌లో రెండో సినిమాను నిర్మించేందుకు రెడీ అవుతున్నాడు. రెండో సినిమాలోనూ నాని హీరోగా నటించటం లేదట. ఇటీవల ఫలక్‌నుమాదాస్‌ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన విశ్వక్‌సేన్‌ హీరోగా నాని బ్యానర్‌లో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాతో ఓ కొత్త దర్శకుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నారు. ఫలక్‌నుమాదాస్‌ సినిమాతో హీరోగా ప్రూవ్‌ చేసుకోవటమే కాదు తన సినిమాకు కావాల్సినంత ప్రచారం తెచ్చుకోవటంలోనూ విశ్వక్‌ సక్సెస్‌ అయ్యాడు. Also Read: సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో విశ్వక్‌చేసిన కామెంట్లు అప్పట్లో పెద్ద దుమారమే లేపాయి. తన సినిమాను కొంతమంది తొక్కేసే ప్రయత్నం చేస్తున్నారంటూ పెద్ద పెద్ద ఆరోపణలే చేశాడు ఈ యంగ్ హీరో. ఇప్పుడు ఆ వివాదాస్పద నటుడితో నాని సినిమా చేస్తుండంపై ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. గతంలో ఓ సినిమా వేడుకలో ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి నాని హింట్‌ ఇచ్చిన పూర్తి వివరాలు ప్రకటించలేదు. Also Read: నాని నిర్మాతగా మారకముందు కూడా తన ఫ్రెండ్స్‌ కోసం ఓ సినిమాలో నిర్మాణభాగస్వామిగా కలిశాడు. సందీప్‌ కిషన్‌ హీరోగా తెరకెక్కిన డీ ఫర్‌ దోపిడి అనే సినిమాకు నాని సమర్పకుడిగా వ్యవహరించాడు. ఆర్థిక సమస్యలతో రిలీజ్‌ కాకుండా ఆగిపోయిన ఆ సినిమాను బయటకు తీసుకువచ్చేందుకు నాని ఆ నిర్ణయం తీసుకున్నాడు. తరువాత పూర్తి స్థాయి నిర్మాతగా మారి వాల్‌ పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై సినిమాలు చేస్తున్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల గ్యాంగ్‌ లీడర్‌ సినిమాతో మరో హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న నాని, ప్రస్తుతం ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న `వి` సినిమాలో ప్రతినాయక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సుధీర్‌ బాబు, అదితిరావ్‌ హైదరీలు హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో నివేదా థామస్‌ మరో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను నాని ఫైనల్‌ చేయాల్సి ఉంది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2BBuAJp

No comments:

Post a Comment

'Love Marriage Was Taboo'

'I have always looked at people and said, 'You just have to accept. You just have to love. You just have to let this person be and t...