Sunday 20 October 2019

సినిమా ఆగిపోలేదట.. ట్రాక్‌లోకి వచ్చిన `హీరో`

టాలీవుడ్‌ సెన్సేషనల్‌ విజయ్‌ దేవరకొండకు సంబంధించిన సెన్సేషనల్‌ న్యూస్‌ ఒకటి మీడియా సర్కి్ల్స్‌లో హల్‌చల్‌ చేస్తోంది. ఈ యంగ్‌ హీరోతో ప్లాన్‌ చేసిన ఓ భారీ చిత్రం ఆగిపోయినట్టుగా గతంలో ప్రచారం జరిగింది. అయితే తాజా సమచారం ప్రకారం ఈ సినిమాను తిరిగి సెట్స్‌ మీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట చిత్రయూనిట్‌. హీరోగా తమిళ దర్శకుడు దర్శకత్వంలో హీరో పేరుతో సినిమాను ప్రారంభించారు. ఈ సినిమాలో విజయ్‌, బైక్‌ రేసర్‌గా నటిస్తున్నాడు. చాలా రోజుల కిందటే షూటింగ్ ప్రారంభించిన ఓ షెడ్యూల్‌ పూర్తి చేశారు. ఢిల్లీలో షూట్‌ చేసిన ఈ షెడ్యూల్‌లో విజయ్‌పై రేసింగ్‌ సీన్స్‌ను చిత్రీకరించారు. Also Read: అయితే నిర్మాతలు అవుట్‌పుట్‌తో సంతృప్తికరంగా లేకపోవటంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టుగా ప్రచారం జరిగింది. దాదాపు 12 కోట్లతో తొలి షెడ్యూల్‌ చేసినా తరువాత ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేశారని అంతా భావించారు. కానీ తాజాగా ఈ సినిమాను తిరిగి ప్రారంభిస్తున్నారట. Also Read: స్పోర్ట్స్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఈ సినిమాతో మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అవుతోంది. ఈ సినిమా చాలా కాలం క్రితమే ప్రారంభమైన మధ్యలో అనేక కారణాలతో షూటింగ్ నిలిచిపోయింది. ముఖ్యంగా భారీ బడ్జెట్‌తో ప్లాన్ చేసిన ఈ సినిమాను డియర్‌ కామ్రేడ్‌ రిలీజ్ తరువాత పక్కన పెట్టేశారు. డియర్‌ కామ్రేడ్‌ డిజాస్టర్‌ కావటంతో, హీరో అవుట్‌ పుట్‌ ఆశించిన స్థాయిలో లేకపోవటంతో అంత బడ్జెట్‌ రిస్క్‌ అన్న ఉద్దేశంతో ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసినట్టుగా ప్రచారం జరిగింది. Also Read: ప్రస్తుతం విజయ్‌ దేవరకొండ క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరల్డ్ ఫేమస్‌ లవర్‌ సినిమాలో నటిస్తున్నాడు. విజయ్‌ సరసన రాశీఖన్నా, కేథరిన్‌ థ్రెస్సా, ఐశ్వర్య రాజేష్‌, ఇసాబెల్లాను హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరకుంది. దీంతో వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ పూర్తయిన వెంటనే హీరో సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు రౌడీ. ఈ సినిమాతో పాటు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకె చెప్పాడు విజయ్‌ దేవరకొండ. పూరి, చార్మీలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఫైటర్‌ అనే టైటిల్‌ను ఫైనల్‌ చేశారు. హీరోతో పాటు ఈ సినిమా షూటింగ్‌లోనూ పాల్గొనేందుకు రెడీ అవుతున్నాడు విజయ్‌ దేవరకొండ. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2P6agrU

No comments:

Post a Comment

'Sonia, Kharge, Rahul Have A Chalta Hai Attitude'

'There is some deep rot that has set in the Congress party. This requires an organisational surgery.' from rediff Top Interviews h...