Monday 21 October 2019

ఒకే పాత్రతో `అలెగ్జాండర్‌`.. హీరోగా సీనియర్‌ విలన్‌

టాలీవుడ్‌లో విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా ఎన్నో విలక్షణ పాత్రల్లో అలరించిన నటుడు జయప్రకాష్ రెడ్డి. ఎన్నో వందల చిత్రాల్లో నటించిన ఈ సీనియర్‌ నటుడు ఇప్పుడు మరో కొత్త అవతారంలో కనిపించనున్నాడు. త్వరలో హీరోగా ఓ సినిమా విడుదల కానుంది. ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై జయప్రకాష్ రెడ్డి హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. అలెగ్జాండర్ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమాను ప్రయోగాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. సినిమాలో కేవలం జయప్రకాష్‌ రెడ్డి ఒక్కడే పాత్రదారి కావటం విశేషం. కథా కథనాలు నచ్చి జయప్రకాష్‌ రెడ్డి స్వయంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Also Read: ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి త్వరలోనే విడుదల తేదిని ప్రకటించేందుకు రెడీ అవుతున్నారు చిత్రయూనిట్. తెలుగు ఇండస్ట్రీలో ప్రతినాయకుడిగా.. కమెడియన్‌గా.. సపోర్టింగ్ ఆర్టిస్టుగా వందల సినిమాల్లో అద్భుతమైన నటనతో ఎంతో విలక్షణమైన పాత్రలతో ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్నారు. ఇప్పుడు ఈయన హీరోగా అలెగ్జాండర్ సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు ధవళ సత్యం. ఒక్కడే నటుడు.. అతడే నట సైన్యం అనేది ట్యాగ్ లైన్. ఈ చిత్రంలో ఆయన ఒక్కరే నటిస్తుండటం విశేషం. అలెగ్జాండర్ షూటింగ్ పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించనున్నారు నిర్మాతలు. ఉద్భవ్ నాన్వి క్రియేషన్స్ బ్యానర్‌పై జయప్రకాష్ రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MxhvqT

No comments:

Post a Comment

'Preparing to enter affordable housing loans space'ns'

'Focus will be on smaller loan amounts to meet the needs of affordable homebuyers.' from rediff Top Interviews https://ift.tt/J1zq...