
టాలీవుడ్ సూపర్ స్టార్ ఒకవైపు సినిమాలు మరోవైపు వ్యాపార ప్రకటనలతో రెండు చేతులా సంపాదిస్తున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యధిక బ్రాండ్‌ను అంబాసిడర్‌గా ఉన్నాడు మహేష్. అంతేకాదు సినిమా నిర్మాణ రంగంలోనూ తనదైన స్టైల్‌లో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఏసియన్ సంస్థతో కలిసి ఏయంబీ సినిమాస్ పేరుతో మల్టీప్లెక్స్‌ను ప్రారంభించాడు. ఈ వ్యాపార వ్యవహారాలన్నింటినీ మహేష్ భార్య చూసుకుంటున్నారు. Also Read: అయితే ఇన్నాళ్లు మహేష్ మాత్రమే వ్యాపార ప్రకటనల్లో నటిస్తూ వచ్చాడు. తాజాగా ఓ యాడ్ కోసం సూపర్ స్టార్ ఫ్యామిలీ అంతా కలిసి నటించటం హాట్ టాపిక్‌గా మారింది. ఓ కన్సస్ట్రక్షన్ కంపెనీకి చెందిన యాడ్‌లో మహేష్, భార్య నమ్రత, పిల్లలు గౌతమ్, సితారలు కూడా నటించారు. ఈ యాడ్‌ను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసిన మహేష్, `ఇది మాకు తొలిసారి. ఈ యాడ్‌లో నటించటం ఆనందంగా ఉంది` అంటూ కామెంట్ చేశాడు. ఈ యాడ్‌ను అభిమానులు సంబర పడిపోతున్నారు. మరి కొంత మంది అభిమానులు కృష్ణగారు కూడా ఉంటే ఇంకా బాగుండేందంటూ అభిప్రాయపడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. 2020 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న ఈ సినిమాను దిల్ రాజు, అనిల్ సుంకరలతో కలిసి మహేష్ బాబు స్వయంగా నిర్మిస్తున్నాడు. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సీనియర్ నటి విజయశాంతి చాలా కాలం తరువాత రీ ఎంట్రీ ఇస్తుంది. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Jjrr5j
No comments:
Post a Comment