Wednesday 23 October 2019

‘ఆడవాళ్లను రాసుకుంటూ వెళ్లారు.. నరేష్ అంతా మనవాళ్లే అన్నారు’

‘మా’ అధ్యక్షుడు వీకే నరేష్‌పై తిరుగుబాటు మొదలైంది. అధ్యక్షుడిగా హక్కులన్నీ తనకే ఉన్నాయని నరేష్ ఇష్టమొచ్చినట్టు చేస్తు్న్నారని ‘మా’ ఎగ్జిక్యూటివ్ కమిటీలోని కొంతమంది సభ్యులు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు చూస్తూ ఊరుకున్నాం కానీ.. ఇకపై అలా జరగదని హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు నరేష్‌పై తిరుగుబాటు చేస్తోన్న ఈసీ సభ్యుల తరఫున జనరల్ సెక్రటరీ జీవిత, వైస్ ప్రెసిడెంట్ హేమ, ఈసీ సభ్యులు జయలక్ష్మి, సమీర్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నరేష్‌పై హేమ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘కొత్త ఎగ్జిక్యూటివ్ కమిటీ ఏర్పడి ఎన్ని నెలలు అయ్యిందో ఆయనకు తెలీదు. అసోసియేషన్‌లో ఫండ్ ఎంత ఉందో తెలీదు. రాజేంద్రప్రసాద్ గారు అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి మేం యాక్టివ్‌గా పనిచేస్తున్నాం. అప్పటి నుంచి మెంబర్స్‌కి మేం పింఛను ఇచ్చినా, బైకులు కొనిచ్చినా, డైరీలు ఓపెన్ చేసినా, ఏదైనా హెల్ప్ చేసినా తక్కువ ఖర్చుతో ఎక్కువ రాబడితో చేసుకున్నాం. చిరంజీవి గారి ఇంటికో, లేదంటే నాగేశ్వరరావు గారి ఇంటికో వెళ్లి డైరీ ఓపెన్ చేయించుకుని ఖర్చు లేకుండా నాలుగు ఫొటోలు తీసుకుని మీడియాకు ఇచ్చాం. నరేష్ అధికారంలోకి వచ్చిన తరవాత నేను అలా చేస్తా ఇలా చేస్తా అని గొప్పలకు పోయి బోలెడంత డబ్బులు ఖర్చుచేసేశారు. ఆ డబ్బులు మాకు మళ్లీ తిరిగిరాలేదు. ఇదేంటండి అంటే.. స్పాన్సర్‌ను తెస్తా అన్నారు. కానీ, తీసుకురాలేదు. అది పక్కనబెడితే.. ప్రమాణ స్వీకారం రోజున గ్రాండ్‌గా పెద్ద ఎల్‌ఈడీ పెట్టి, అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే, ఆరోజు మెంబర్స్, ప్రెస్ వాళ్లతో పాటు బయటి వాళ్లు చాలా మంది వచ్చారు. అప్పుడు నేను నరేష్ గారిని అడిగాను. మన మెంబర్స్, ప్రెస్ వాళ్లు ఇబ్బంది పడుతున్నారు.. మనమంతా 200 మంది మాత్రమే ఉన్నాం, ఎవరు వీళ్లంతా అనడిగాను. వాళ్లు ఎలా ఉన్నారంటే.. మా మహిళా సభ్యులను రాసుకుంటూ, మీద పడిపోతు ఇష్టమొచ్చినట్టు చేశారు. నేను డైరెక్ట్‌గా నరేష్ గారి దగ్గరకి వెళ్లి అడిగాను. హేమ హేమ.. మాట్లాడకు, వాళ్లంతా మనవాళ్లే అన్నారు. ఇదంతా మన డబ్బు కాదు.. నేను, స్పాన్సర్‌ని తీసుకొస్తున్నాను అన్నారు. 400 మందికి ఫిల్మ్ నగర్ క్లబ్‌లో నేను స్వయంగా లక్షలు కట్టాను. మెంబర్స్, ప్రెస్ వాళ్లు 200 మందే. ఎక్స్‌ట్రా 200 మందికి నేను డబ్బులు కట్టాను. ఈరోజు వరకు నాకు ఆ డబ్బులు రాలేదు. ఈ తొమ్మిది నెలల మన సుధీర్ఘ ప్రయాణంలో మీరు ఎంత ఖర్చుపెట్టారు.. ఎంత సంపాదించారు చెప్పండి నరేష్ గారు. ఇక ముందు ఏం సంపాదిస్తారు అనేది తరవాత చెప్పండి. ఈ 9 నెలల్లో ఏం చేశారో ముందు చెప్పండి. ఏమన్నా అడిగితే ఇన్సూరెన్స్ చేశాం, మెడికల్ క్లైమ్ చేశాం అంటున్నారు. మీరు కాకపోతే నేను ప్రెసిడెంట్‌గా ఉన్నా అదే చేస్తాను. ఎవరు డబ్బులు అవి.. ‘మా’ డబ్బులు’’ అంటూ హేమ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32GDaTa

No comments:

Post a Comment

'Kashmiri Youth Don't Want To Die'

'...or go to jail.' from rediff Top Interviews https://ift.tt/PuENKGD