Sunday, 6 October 2019

సోలో బ్రతుకే సో బెటర్.. సాయి తేజ్ రూట్ మార్చాడు

మెగామేనల్లుడు అనే ట్యాగ్ లైన్‌తో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మూడు హిట్స్ కొట్టి హ్యాట్రిక్ హీరో అనిపించుకున్నాడు.ఆ సక్సెస్ స్వింగ్‌లో రేయ్ ఫెయిల్యూర్ కూడా అతని అకౌంట్‌లో కౌంట్ కాలేదు. కానీ తరువాత మాత్రం ఏకంగా డబుల్ హ్యాట్రిక్ డిజాస్టర్స్ అందుకున్నాడు. దాంతో అతని కెరీర్ కూడా ప్రమాదంలో పడింది. కానీ చిత్రలహరి సినిమా మాత్రం అతని పరాజయాల పరంపరకు ఆనకట్ట వేసింది.ఆ సినిమా హిట్ కాదు, కానీ ఫ్లాప్ కూడా కాదు. ప్రతి ఒక్కరికి పెట్టిన పెట్టుబడి వెనక్కు తీసుకువచ్చింది. దాంతో మాస్ హీరో ఇమేజ్‌ని మార్చుకుని ముందుకు వెళ్ళడానికి ఫిక్స్ అయ్యాడు. చిత్రలహరి సినిమా కోసం అతని ఆలోచనలతో పాటు పేరు కూడా సాయి తేజ్‌గా మార్చుకున్నాడు. Also Read: ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో ప్రతి రోజు పండుగే అనే సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పేరు చూస్తుంటేనే అర్ధమవుతుంది అది ఒక ఎమోషనల్ ఎంటర్టైనర్ అని. ఆ సినిమా ఫస్ట్ లుక్‌లో కూడా అదే విషయాన్నీ కన్వే చేసారు. ఆ సినిమా కూడా బాగా వస్తుంది. హిట్ అవుతుంది అనే నమ్మకం కలిగింది. అందుకే తన తరువాతి సినిమాకి కూడా మరొక సాఫ్ట్ టైటిల్‌ని ఎంచుకున్నాడు. మాస్ స్టోరీస్ చేస్తే ఒళ్ళంతా నొప్పులు, సినిమా రిలీజ్ అయ్యాక తల బొప్పులు అని అర్ధమయిన ఇప్పుడు మరొక లైట్ హార్టెడ్ హ్యూమరస్ స్టోరీని ఎంచుకున్నాడు. సుబ్బు అనే కొత్త డైరెక్టర్ చెప్పిన స్టోరీని ఓకే చేసిన తేజు ప్రతి రోజు పండుగే సినిమా షూటింగ్ దగ్గరపడుతుండటంతో తన కొత్త సినిమాని పట్టాలెక్కిస్తున్నాడు. Also Read: తన కొత్త సినిమాకి కూడా మరొక ఇంట్రెస్టింగ్ అండ్ క్యాచీ టైటిల్ ఫిక్స్ చేసుకున్నాడు తేజు. ...ఇది ఆ కొత్త సినిమా టైటిల్. ఇది వింటే మంచి సెటైరికల్ ఫీల్ ఉంది కానీ ఎక్కడా కూడా ఈ సినిమాలో సూపర్ యాక్షన్ ఉంటుంది అని కన్వే చెయ్యలేదు. రీసెంట్‌గా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న నభా నటేష్ ఈ సినిమాలో హీరోయిన్. ఈ సినిమా కూడా హిట్ అయితే నభా కెరీర్ ఊపందుకుంటుంది. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై BVSN ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. సుబ్బు అనే కొత్త డైరెక్టర్ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2nmNCQj

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....