
సినీరంగంలో సక్సె్‌స్ సాధించటమంటే మామూలు విషయం కాదు. ఎంత టాలెంట్ ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవటం అంత ఈజీకాదు. ఎన్నో ఏళ్ల నిరీక్షణ, కృషీ, పట్టుదల ఉంటేగానీ అది సాధ్యం కాదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో సాంకేతిక నిపుణుడిగా సక్సెస్ అవ్వాలంటే చాలా ఏళ్ల సమయం పడుతుంది. అయితే ఇలాంటి లెక్కలను పక్కకు నెట్టి అతి చిన్న వయస్సుల్లోనే సినిమాటోగ్రాఫర్‌గా ఎంట్రీ ఇస్తున్నాడు . సినిమాకు అసిస్టెంట్ కెమెరామేన్‌గా పనిచేసిన సిద్దం మనోహర్, తన టాలెంట్‌తో ఆ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్‌ను మెప్పించాడు. మనోహర్ వర్కింగ్ స్టైల్, కెమెరా, లైటింగ్ విషయంలో విషయంలో మనోహర్‌కు ఉన్న నాలెడ్జ్ గురించి తెలుసుకున్న నాగ్ అశ్విన్.. తొలిసారిగా తాను నిర్మాతగా మారి రూపొందిస్తున్న సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా అవకాశం ఇచ్చాడు. Also Read: మహానటి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత స్వప్న సినిమా బ్యానర్‌లో తెరకెక్కుతున్న మరో సినిమా జాతి రత్నాలు. ఈ సినిమాతో జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నాగ అశ్విన్ నిర్మాతగా మారుతున్నాడు. నవీన్ పోలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు అనుదీప్ కేవీ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్‌లుక్ ఇటీవల విడుదలైంది. Also Read: ఈ ఫస్ట్ లుక్‌లో ముగ్గురు నటులు ఖైధీల డ్రస్‌లలో కనిపించారు. వాళ్ల ఖైదీ నంబర్లు కూడా నవీన్ 420, ప్రియదర్శి 210, రాహుల్ రామకృష్ణ 840గా చూపించారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో సూపర్‌హిట్ అందుకున్న నవీన్, బ్రోచేవారెవరురాతో ఆకట్టుకున్న ప్రియదర్శి, రాహుల రామకృష్ణల కాంబినేషన్‌పై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు రథన్ సంగీతమందిస్తున్నాడు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2BGgp69
No comments:
Post a Comment