
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘అల వైకుంఠపురంలో’. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా.. ఈ సినిమాలోని ‘సామజవరగమన’ అనే పాటను చిత్రబృందం ఇటీవల విడుదల చేసిన సంగతి తెలిసిందే. ‘ఉండిపోరాదే’ అంటూ తన మెలోడియస్ వాయస్‌తో యూత్‌ను మెస్మరైజ్ చేసిన సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు. ‘నీ కాళ్లని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్లు.. ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్లకు దయలేదా అసలు.. నీ కళ్లకి కావలి కాస్తాయే కాటుకలా నా కలలు..నువ్వు నులుముతుంటే ఎర్రగా కంది చిందేనే సెగలు’ అంటూ సాగుతున్న ఈ పాట వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది. ఈ పాటకు విపరీతమైన రెస్పా్న్స్ వస్తోంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి చక్కటి లిరిక్స్ అందించారు. అయితే ఈ పాట పాడిన సిద్ శ్రీరామ్‌పై కామెంట్స్ చేస్తున్నారు సింగర్ కళ్యాణి మాలిక్. తప్పుగా పాడాడంటూ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ‘నువ్వు పాటలోని పదాలను పలికిన తీరుకు చప్పట్లు కొడుతున్నాను. ఇప్పుడు నువ్వు స్టార్ సింగర్‌వి కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ తమన్ నువ్వు ‘మహా ప్రసాదం’ అన్న పదాన్ని తప్పుగా పలికినప్పటికీ నిన్ను సింగర్‌గా పెట్టుకున్నారు. అందుక ఆయన్ను అభినందిస్తున్నాను. ఇక లిరిక్స్‌కు నేను నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’ అని వెటకారంగా కామెంట్ చేశాడు. పాటలోని ‘మహా ప్రసాదం’ అనే లిరిక్‌ను సిద్ శ్రీరామ్ వినలేనంత ఘోరంగా పలికారని కళ్యాణి కామెంట్ చేశారు. అయితే ఈ పాటకు, సిద్ శ్రీరామ్‌కు ఎక్కువ పాపులారిటీ వస్తుండడం వల్ల కళ్యాణి కుళ్లకుంటున్నారని ఓర్వలేకే ఈ కామెంట్స్ చేస్తు్న్నారని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. పాట లిరిక్స్‌ను సిద్ తప్పుగా పాడి ఉంటే తమన్ సరిదిద్దేవారని, ఆయనకు కనిపించని తప్పు కళ్యాణి మాలిక్‌కి మాత్రమే ఎలా కనిపించిందని ప్రశ్నిస్తున్నారు. దీనిపై తమన్ కానీ సిద్ శ్రీరామ్ కానీ స్పందిస్తేనే ఓ క్లారిటీ వచ్చేలా ఉంది. మరోపక్క ఈ పాట రిలీజ్ అయిన కొన్ని గంటల్లోనే యూ ట్యూబ్ ట్రెండింగ్‌లో నెంబర్ 1 ప్లేస్‌కి చేరింది. కేవలం ఇక్కడ మాత్రమే కాదు నేషనల్ వైడ్‌గా కూడా టాప్ 10 లో స్థానం దక్కించుకుంది. ‘అల వైకుంఠపురంలో’ చిత్రంలో టబు, నివేదా పేతురాజ్, రాజేంద్ర ప్రసాద్, జయరామ్, సుశాంత్, వెన్నెల కిశోర్, సునీల్, బ్రహ్మాజీ, మురళీ శర్మ, హర్ష వర్ధన్, సచిన్ ఖెడేకర్ కీలక పాత్రలు పోషించారు. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అల..వైకుంఠపురములో సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. అందుకే ఇప్పటినుండి ఆ సినిమాకి ఫుల్‌గా బజ్ పెంచే పనిలో బిజీ అయ్యారు. సినిమా ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లా ఉంటుందని తెలుస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2omb14I
No comments:
Post a Comment