‘మల్లేశం’.. వెండితెరపై మరో జీవిత కథ ఆవిస్కృతమైంది. పద్మశ్రీ అవార్డు గ్రహీత, చేనేత కార్మికుల కోసం ఆసుయంత్రాన్ని కనుగొన్న చింతకింది మల్లేశం జీవితకథే ‘మల్లేశం’ చిత్రం. పాత్రలో ‘పెళ్లి చూపులు’ ఫేమ్ ప్రియదర్శన్ నటించారు. ఒక చీరకు ఆసు పోయాలంటే దారాన్ని పిన్నుల చుట్టూ 9 వేల సార్లు అటూ ఇటూ తిప్పాలి. ఆ రకంగా రోజుకి 18 వేల సార్లు దారాన్ని కండెల చుట్టూ తిప్పితే రెండు చీరలను మాత్రమే నేయగలరు. రోజుకు రెండు చీరెలు నేస్తేనే కార్మికుడికి గిట్టుబాటు అవుతుంది. దారాన్ని కండెల చుట్టూ తిప్పడానికి మల్లేశం తల్లి లక్ష్మి చాలా కష్టపడేవారు. చేతులు, భుజం నొప్పితో బాధపడేవారు. తల్లి వేదన చూడలేకపోయిన మల్లేశం.. హైదరాబాద్ వచ్చి ఏడేళ్లపాటు శ్రమించి ఆసు యంత్రానికి రూపకల్పన చేశారు. ఈ నేపథ్య కథతో హృద్యంగా ‘మల్లేశం’ సినిమాను రూపొందించారు. సురేశ్ ప్రొడక్షన్ రిలీజ్ చేసిన ఈ చిత్రంలో ప్రియదర్శి జోడిగా అనన్య నటించింది. మల్లేశం తల్లి పాత్రలో ఝాన్సీ నటించారు. రాజ్ ఆర్ సినిమాకు దర్శకత్వం వహించగా.. శ్రీ అధికారి నిర్మించారు. మార్క్ కే రోబిన్ సంగీతం అందించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ఇక శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ప్రీమియర్ షోలు ఇప్పటికే ప్రదర్శితం కావడంతో విమర్శలకు ప్రశంసల్ని దక్కించుకుని ట్విట్టర్‌లో పాజిటివ్ రెస్పాన్స్‌ని రాబట్టింది. ప్రేక్షకుల స్పందనల్ని ఈ ట్వీట్స్ ద్వారా చూద్దాం.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2XqpEUj
No comments:
Post a Comment