Sunday, 23 June 2019

Janasena: ‘పవన్‌కి బీజేపీ పగ్గాలతో పాటు మరో రెండు దారులు’!

ఎన్నికల ఫలితాల తరువాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ 151 సీట్లతో ఘన విజయం సాధించగా.. పక్కాగా గెలుపు మాదే అంటూ తొడలు చరిచిన తెలుగుదేశం పార్టీకి చావు దెబ్బ తగిలింది. ఎవరూ ఊహించని విధంగా 23 సీట్లకే పరిమితం కాగా.. ఎంతో కొంత ప్రభావం చూపుతాడనుకున్న తాను పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోవడమే కాకుండా పార్టీ నుండి ఒకే ఒక్కరు ( రాపాక వరప్రసాద్-రాజోలు) మాత్రమే గెలిచారు. ఇక ఫలితాల అనంతరం టీడీపీలో ముసలం ఏర్పడింది. రాజ్యసభ ఎంపీలు మూకుమ్మడిగా బీజేపీలో చేరి టీడీపీని బీజేపీలో విలీనానికి ప్రతిపాదనలు తీసుకువచ్చారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేలు సైతం రేపో మాపో జంప్ అయ్యేందుకు సంప్రదింపులు జరుపుతుండటంతో టీడీపీలో పెద్ద ముసలం ఏర్పడింది. పార్టీ పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం ఇక అసాధ్యమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్న తరుణంలో.. వైసీపీకి ప్రత్యామ్నాయం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావొచ్చంటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మూవీ క్రిటిక్ మహేష్ కత్తి. ఇందుకోసం పవన్ కళ్యాణ్ ముందు మూడు దారులు ఉన్నాయని వాటిని ఉపయోగించుకుంటే.. పవన్ కళ్యాణ్ 2024 నాటికి ప్రధాన పోటీగా మారతాడంటున్నారాయన. ఇంతకీ చెప్పే ఆ మూడు దారులు ఏంటో ఆయన మాటల్లోనే.. ‘నాకన్నా పెద్ద అభిమాని పవన్ కళ్యాణ్‌కి ఎవరూ లేరు. 2019 ఎన్నికల్లో పవన్ గెలవలేదని, మాములుగా తాగే రెండుపెగ్గులకి మరో రెండు కలిపికొట్టి నా విషాదాన్ని మిత్రులతో పంచుకున్నాను. అప్పటి నుంచీ పవన్ కళ్యాణ్ రాజకీయ భవిష్యత్తు మీద, జనసేన పార్టీ మీద బెంగతో చచ్చిపోతున్నాను. ఏంచేస్తే 2024 నాటికి పార్టీకి, పవన్‌కి రాజకీయపునర్జీవం వస్తుంది అనే విషయంపై నాకున్న మూడు దారుల స్ట్రాటజీ ఇక్కడ పెడుతున్నాను. 1.మొదటి దారి.. ‘పార్టీ బలోపేతం ఇలా’ : తెలుగుదేశం పార్టీ ఎలాగూ కనుమారుగైపోతొంది గనక, ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలి అంటే, జనసేన గ్రామస్థాయి, మండలస్థాయి,జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుతో బలపడి. మానవవనరుల ఏర్పాటు చేసుకోవాలి. క్యాడర్ నిర్మాణం జరగాలి. జీరో బడ్జెట్ బెస్ట్ పాలిటిక్స్ అంటున్నారుగనక ప్రజల నుంచీ సానుభూతిపరుల నుంచీ తగినంత ఆర్థికవనరులు జమచేసుకోవాలి. కాపు ప్రాబల్యం ఉన్న గోదావరి జిల్లాలే కాకుండా వెనుకబడిన ప్రాంతాలైన ఉత్తరాధ్ర, రాయలసీమల్లోకూడా ఫోకస్ పెట్టాలి. కనీసం 50-60 నియోజకవర్గాలలో లీడర్షిప్ ని గుర్తించి,ప్రజలతో మమేకమై ప్రజాపోరాటాల దిశగా పనిచేసేలా చెయ్యాలి. ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందకపోయినా,అమలు సరిగ్గా కాకపోయినా,అవినీతి జరిగినా లోకల్ గా ప్రశ్నించి ఉద్యమాలు చేసే స్థాయిలో వీళ్ళు ఉంటే, ఆటోమేటిక్ గా జనసేన నుంచీ ఎమ్మెల్యేలుగా వీళ్ళే ప్రాజెక్ట్ అవుతారు. జనసేన పార్టీ ప్రజల్లో ఉంటుంది. పవన్ కళ్యాణ్ వీలైనన్ని సార్లు ఈ నియోజకవర్గాలను విజిట్ చేస్తూ, రాష్ట్ర స్థాయి ఉద్యమాలు సమీక్షలు చేస్తే చాలు. 2.రెండోదారి.. ‘బీజేపీ పగ్గాలు’: బీజేపీ పార్టీ తెలుగుదేశం పార్టీని లేకుండా చేసి, వాళ్ళు ప్రత్యామ్నాయంగా ఎదగాలని ఆంధ్రప్రదేశ్‌లో ట్రైచేస్తున్నారు. కానీ ఆపార్టీలో జనాకర్షణ ఉన్న నాయకులు లేరు. జనసేనకు బీజేపీలో విలీనం చేసేసి, పవన్ కళ్యాణ్ బీజేపీ పగ్గాలు పట్టుకుంటే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఆర్ధిక,మానవవనరుల గురించి ఆలోచన అవసరం లేదు. ఘర్షణ,పోరాట దీక్షలు అవసరం లేదు. ఈజీగా లైఫ్ లో సక్సెస్ఫుల్ రాజకీయనాయకుడు అయిపోతాడు. అదృష్టం వారిస్తే ఇక్కడ ముఖ్యమంత్రి కాకపోయినా ఎదో ఒక రాష్ట్రానికి గవర్నరో, దేశానికి ఉపరాష్ట్రపతో అయిపోతాడు. 3.మూడోదారి.. ‘కుల సమీకరణ’: చంద్రబాబు బలహీనంగా ఉన్నాడు. తెలుగుదేశం ఉంటుందో ఊడుతుందో తెలీదు. కమ్మలు తెప్పటగలేస్తున్నారు. కాపులు పార్టీని వదిలేసే ప్రమాదం కనిపిస్తోంది. లోకేష్ ను భవిష్యత్తుగా ఉహించుకోవడానికి పార్టీవాళ్లకే కష్టంగా ఉంది. ఈ టైంలో కాపుల్ని మల్లేసుకొచ్చే గొర్రెల కాపరిలా పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఇస్తే...తెలుగుదేశం లో నెంబర్ టూ పొజిషన్ గ్యారంటీ. ఇప్పుడు కాకపోతే మరో పదేళ్లకు, చంద్రబాబు పోయేనాటికి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి.. ఇది నా ప్రణాళిక...ఏమంటారు?’ అంటూ పవన్ కళ్యాణ్‌ ముందు మూడు సలహాలను ఉంచారు కత్తి మహేష్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2WZ7ogq

No comments:

Post a Comment

'We Will Also Make Waves One Day'

'When you are in new waters, you have to follow the rules of that water.' from rediff Top Interviews https://ift.tt/8vDaJRw