టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ ‘దొరసాని’ చిత్రంతో తెరంగేట్రం చేస్తున్నారు. ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ మధుర ఎంటర్ టైన్మెంట్ , బిగ్ బెన్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలను పూర్తిచేసుకొని జూలై 12న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా రిలీజ్ డేట్‌ను అఫీషియల్‌గా ప్రకటిస్తూ రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. ఈ చిత్రంతో దర్శకుడిగా కె.వి.ఆర్ మహేంద్ర పరిచయం అవుతున్నాడు. 80వ దశకంలో తెలంగాణ ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఒక స్వచ్ఛమైన ప్రేమకథను ‘దొరసాని’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది చిత్ర యూనిట్. తారగణం... ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్, కన్నడ కిశోర్, వినయ్ వర్మ, ‘ఫిదా’ శరణ్య తదితరుల నటిస్తున్నారు. టెక్నికల్ టీం.. సమర్పణ: డి.సురేష్ బాబు సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి ఎడిటర్ : నవీన్ నూలి సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి ఆర్ట్ డైరెక్టర్ : జె.కె మూర్తి పి.ఆర్.వో : జి.ఎస్.కె మీడియా కో ప్రొడ్యూసర్ : ధీరజ్ మొగిలినేని నిర్మాతలు : మధుర శ్రీధర్ రెడ్డి, యశ్ రంగినేని రచన, దర్శకత్వం : కె.వి.ఆర్. మహేంద్ర
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2Y4f8PF
No comments:
Post a Comment