హైదరాబాద్‌లో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి నగరంలోని రోడ్లన్నీ చెరువులను తలపించాయి. ప్రధాన రహదారులపై వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అష్టకష్టాలు పడ్డారు. దీంతో ఎక్కడ చూసినా ట్రాఫిక్ రద్దీ నెలకొంది. సామ్యానులతో పాటు సెలబ్రెటీలకు కూడా ట్రాఫిక్ జామ్ సెగ తగిలింది. శుక్రవారం ఓ పని నిమిత్తం బయటకు వచ్చిన టాలీవుడ్ కూడా ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్నారు. దీంతో ఆయన కారు దిగి మెట్రో రైలెక్కి గమ్య స్థానానికి చేరుకున్నారు. కిక్కిరిసిన కోచ్‌లో ఎక్కిన నితిన్‌తో సెల్ఫీలు దిగేందుకు, షేక్‌హ్యాండ్ ఇచ్చేందుకు మెట్రో ప్రయాణికులు పోటీ పడ్డారు. నితిన్ సైతం వారితో నవ్వుతూ మాట్లాడుతూ సందడి చేశారు. తాను దిగాల్సిన స్టేషన్ వచ్చాక అందరికీ బాయ్ చెబుతూ ఆయన వెళ్లిపోయారు. మెట్రో స్టేషన్లో తీసుకున్న ఫోటోను తన ట్విటర్ అకౌంట్లో ట్వీట్ చేసిన నితిన్.. రోడ్లు చాలా రద్దీగా ఉన్నాయని, ట్రాఫిక్ నుంచి తప్పించుకునేందుకు మెట్రో ఎక్కానని. ఈ ప్రయాణం అద్భుతంగా సాగింటూ’ ట్వీట్ చేస్తూ ఫోటోలు జత చేశారు. శుక్రవారం కురిసిన వర్షానికి మెట్రో రైళ్లు కిక్కిరిసిపోయాయి. ట్రాఫిక్ జామ్‌లో చిక్కుకున్న ప్రజలు, ఉద్యోగులు మెట్రో రైల్ ఎక్కేందుకు ఆసక్తి చూపడంతో స్టేషన్లతో పాటు రైళ్లు నిండిపోయాయి. ముఖ్యంగా హైటెక్ సిటీ నుంచి అమీర్‌పేట వరకు ఉన్న మెట్రో మార్గంలో సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మెట్రో రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడాయి. హైటెక్‌సిటీ నుంచి అమీర్‌పేట మెట్రో మార్గంలో ఊహించనంత రద్దీ కనిపించిందని, ఓ టైమ్‌లో ప్రయాణికులను నియంత్రించలేని పరిస్థితి నెలకొందని మెట్రో అధికారులు చెబుతున్నారు. వర్షాకాలం తరుచూ ఇలాంటి పరిస్థితి తలెత్తే పరిస్థితి ఉండటంతో దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2RqxasS
No comments:
Post a Comment