Krishna Funeral Updates: సూపర్‌స్టార్ కృష్ణ (Superstar Krishna) పార్థివ దేహాన్ని పద్మాలయా స్టూడియోకి తీసుకొచ్చారు. ఈరోజు అంటే బుధవారం మధ్యాహ్నం 12 గంటల తర్వాత అంతిమ యాత్ర, అంత్యక్రియలు జరగనున్నాయి. అభిమాన కథానాయకుడి కడసారి చూపులకు ఫ్యాన్స్‌ను అనుమతించారు. దీంతో భారీగా అభిమానులు పద్మాలయా స్టూడియో చేరుకున్నారు. బారులు తీరారు. ఎక్కువ సంఖ్యలో అభిమానులు వస్తారని ముందే ఊహించిన ప్రభుత్వం కూడా పద్మాలయా స్టూడియో దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/YQmyhkt
No comments:
Post a Comment