Friday 9 July 2021

Seenayya : ‘సీనయ్య’పై నోరు విప్పిన డైరెక్టర్.. ఇకపై అలానే అంటూ వినాయక్ కామెంట్స్

దర్శకుడు ఒకప్పుడు విజయాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే వారు. మాస్ పల్స్ తెలిసిన డైరెక్టర్‌గా టాలీవుడ్‌లో నెంబర్ వన్ స్థానాన్ని కొంత కాలం అనుభవించారు. అలాంటి వినాయక్‌కు మధ్యలో దారుణమైన డిజాస్టర్లు వచ్చాయి. ఇక వినాయక్‌ దర్శకుడిగా సక్సెస్ చూసి చాలా కాలమే అయింది. అయితే అలాంటి సమయంలోనే వినాయక్‌ను హీరోగా నిలబెట్టేందుకు దిల్ రాజు ముందుకు వచ్చారు. అనే ప్రాజెక్ట్‌తో వినాయక్‌ను హీరోగా పరిచయం చేసేందుకు దిల్ రాజు మంచి ప్లాన్ వేశారు. షూటింగ్ కూడా జరిపించారు. కానీ మధ్యలోనే ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. హీరోయిన్ విషయంలోనూ సమస్యలు తలెత్తాయి. ఈ ప్రాజెక్ట్ కోసం వినాయక్ భారీగా బరువు తగ్గారు. తన మేకోవర్‌ను మార్చేసుకున్నారు. అంత చేసినా కూడా ఫలితం మాత్రం రాకుండా పోయింది. మధ్యలోనే ప్రాజెక్ట్ ఆగిపోయింది. అయితే ఇన్ని రోజులు తరువాత వినాయక్ తన శీనయ్య సినిమా గురించి మాట్లాడారు. ఎట్టకేలను ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ నోరు విప్పారు. తాజాగా ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఛత్రపతి రీమేక్ గురించి చెప్పుకొచ్చారు. అదే క్రమంలో తన స్పీడు తగ్గడం, సినిమాలేవీ లైన్‌లో లేకపోవడం గురించి అసలు విషయం తెలిపారు. తాను సినిమాలు చేయకపోవడానికి కారణాలున్నాయని వినాయక్ అన్నారు. ‘ఏదో అనుకోవడం, అది కరెక్ట్‌గా రాకపోవడం... మధ్యలో నిర్మాత దిల్‌రాజు ‘శీనయ్య’ సినిమాతో రావడం, అదీ సరిగ్గా రాకపోవడం...అలా అలా సమయం గడిచిపోయింది. ఇక నుంచి వేగంగా సినిమాలు చేయాలనే ప్రణాళికలు ఉన్నాయి. ‘ఛత్రపతి’ రీమేక్‌ తర్వాత పెన్‌ స్టూడియోస్‌లోనే పని చేయాలి. అది ఏమిటనేది మళ్లీ చెబుతా’ అంటూ తన భవిష్యత్ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇచ్చారు. ఛత్రపతి హిందీ రీమేక్ గురించి చెబుతూ.. రచయిత విజయేంద్రప్రసాద్‌ కొన్ని మార్పులు చేర్పులు సూచించారని అన్నారు. తామంతా కూడా ఒక బృందంగా కూర్చుని స్క్రిప్ట్‌ కోసం పనిచేశామని తెలిపారు. రాజమౌళి ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’ సినిమా విషయంలో బిజీగా ఉండటంతో కలవలేకపోయా.. ఎప్పుడైనా కూర్చుని చర్చిస్తామని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yFaDwU

No comments:

Post a Comment

'Young Desi Men May Vote For Trump'

'One of the big findings is that younger men seem to have shifted towards the Republican Party.' from rediff Top Interviews https:...