Friday 16 July 2021

Narappa: వెంకటేశ్ ఎంతో బాధపడ్డాడు.. ఆ నిర్మాత వల్లే ఓటీటీలో.. అసలు విషయం చెప్పిన సురేశ్ బాబు

ప్రస్తుతం సినీ పరిశ్రమ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలిసిందే. మేకర్స్ అంతా కూడా తమ సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు. చకచకా షూటింగ్‌లను కానిచ్చేస్తున్నారు. కానీ అవి ప్రేక్షకులకు చేరేందుకు కావాల్సిన థియేటర్ వ్యవస్థ మాత్రం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. ఏపీలో టికెట్ రేట్ల సమస్య, తెలంగాణలో పర్మిషన్ ఇచ్చినా కూడా థియేటర్లు తెరవలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో కొందరు ఓటీటీ బాట పట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. నారప్పను ఓటీటీకి అప్పగించడంపై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అసోసియేషన్ ఎంతలా మండిపడిందో అందరికీ తెలిసిందే. కనీసం అక్టోబర్ వరకు ఇలా ఓటీటీలకు అమ్ముకోవడం ఆపండి అని సురేష్ బాబును వేడుకున్నారు. కానీ సురేష్ బాబు మాత్రం వెనక్కి తగ్గలేదు. తాను అనుకున్నట్టుగానే నారప్పను అమెజాన్ ప్రైమ్‌లో జూలై 20న వదల బోతోన్నారు. ఈ మేరకు సురేష్ బాబు మాట్లాడుతూ అలా చేయడానికి గల కారణాలను వివరించారు. ప్రమోషన్స్‌లో భాగంగా ఓ మీడియాతో సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘అసురన్ సినిమా ప్రథమార్థం చూశాక.. రీమేక్ చేయగలిగే సినిమానే అని కళైపులి థానుకు ఫోన్ చేశాను. రీమేక్స్ రైట్స్ అడిగాను. నేను ప్రొడ్యూస్ చేస్తాను అని థాను అన్నారు. ఇద్దరం కలిసి నిర్మిద్దామని చెప్పాను. అలా నారప్ప మొదలైంది. ఆ సమయంలో ఓటీటీకి ఇద్దామనే ఆలోచన మాలో ఎవ్వరికీ లేదు కదా. థాను గారు కర్ణన్ సినిమా పాండమిక్ సమయంలోనే రిలీజ్ చేశారు. ఆ సినిమా బాగానే ఆడింది. అలా రెండు వారాల తరువాత సెకండ్ వేవ్ ఎక్కువైంది. థియేటర్లు మూత పడ్డాయి. నష్టం వచ్చింది. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటి ఘటనే జరుగవచ్చు అనే అనుమానం ఉంది. నారప్పను ఓటీటీకి ఇవ్వాలంటూ మంచి డీల్ వచ్చిందని ఆయన చెప్పారు. ఇక ఆయన కూడా నిర్మాతే.. ఆయన్ను కాదు అని నేను అనలేను. ఓటీటీలో సినిమా విడుదల చేస్తామని అనేసరికి కూడా బాధపడ్డారు. ఎంతో మంది ఫ్యాన్స్ ఫోన్ చేసి ఎమోషనల్ అయ్యారు. కానీ ఇది కొత్త పద్దతి. ఓటీటీలు ఎప్పటికీ ఉంటాయి. థియేటర్లు కూడా ఎప్పటికీ ఉంటాయి. కానీ ఎప్పుడు ఎక్కడ విడుదల చేయాలని ఆలోచించుకోవాలి. నాకు కూడా థియేటర్లు ఉన్నాయి. నాకు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కష్టాలు తెలుసు. కానీ ఇది అశాశ్వతం. మళ్లీ సాధారణ పరిస్థితులు వస్తాయ’ని సురేష్ బాబు చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3erGDgp

No comments:

Post a Comment

'They Can Easily Arrest You'

'The work of a film-maker is going out and making films.' from rediff Top Interviews https://ift.tt/TdM2ew6