Saturday 10 July 2021

Narappa: చలాకీ చిన్నమ్మి సాంగ్ రిలీజ్.. ఎడ్లబండిపై వెంకీ, ప్రియమణి! మణిశర్మ బాణీలు అదుర్స్

విక్టరీ వెంకటేష్ హీరోగా రూపొందుతున్న కొత్త సినిమా ''. తమిళ మూవీ 'అసురన్’కు రీమేక్‌గా ఈ సినిమా రూపొందుతోంది. వెంకటేష్ 74వ సినిమాగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియమణి హీరోయిన్‌గా నటిస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మణిశర్మ సంగీతం కడుతున్నారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని U/A సర్టిఫికెట్ పొందిన ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా.. నేడు (జులై 11) మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా తొలి పాట విడుదల చేశారు. '' అంటూ సాగిపోతున్న ఈ పాటలో పల్లె అందాలు చూపిస్తూ ఆసక్తి పెంచేశారు. ఎడ్ల బండిపై వెంకీ, ప్రియమణి ప్రయాణం, వాళ్ళిద్దరి డిఫరెంట్ లుక్స్ హైలైట్ అయ్యాయి. దీనికి షూటింగ్ లొకేషన్ క్లిప్స్ జత చేస్తూ ఆకట్టుకున్నారు. ఆదిత్య అయ్యంగార్, నూతన మోహన్ ఆలపించిన ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ రాశారు. మణిశర్మ బాణీల్లో వస్తున్న ఈ సాంగ్ ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకుతోంది. నిజానికి మే 14న రిలీజ్‌ కావాల్సిన 'నారప్ప' మూవీ కరోనా దాడి కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. అందరి ఆరోగ్యం, రక్షణ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాను వాయిదా వేస్తున్నామని ప్రకటించారు మేకర్స్. అయితే చూస్తుంటే రిలీజ్ మరింత ఆలస్యం అవుతుండటంతో ఓటీటీ వేదికగా 'నారప్ప'ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై నిర్మాతల నుంచి ఎటువంటి క్లారిటీ మాత్రం రాలేదు. కాగా, మొత్తానికైతే తొలి పాటతో వెంకీ అభిమానుల్లో ఇప్పటికే ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది చిత్రయూనిట్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ka0PHd

No comments:

Post a Comment

'Kamala-Trump Race Is Very Close'

'If Trump wins the election, there's not going to be much turmoil.' from rediff Top Interviews https://ift.tt/VNgPS9i