Sunday, 25 July 2021

సినిమా రౌండప్: నాగ చైతన్య న్యూ స్టెప్.. సర్దేసిన ఆలియా! ఏమవుతానో ఊహించలేదన్న హాట్ బ్యూటీ

సర్దేసిన ఆలియా! షూటింగ్ నిమిత్తం గత వారం హైదరాబాద్‌ వచ్చిన ఆలియా భట్‌.. ఆ పని ముగించుకొని ముంబై వెళ్ళిపోయింది. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్న రామ్‌చరణ్‌కు జోడీగా సీత పాత్రలో ఆలియా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఆలియా లుక్స్ హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. నాగ చైతన్య న్యూ స్టెప్ క్రమంగా ఓటీటీల హవా పెరుగుతున్న నేపథ్యంలో నాగ చైతన్య కన్ను కూడా అక్కడే పడిందట. తెలుగు నిర్మాత శరత్‌ మరార్‌ సిద్ధం చేయించిన ఓ కథతో నాగచైతన్య డిజిటల్‌ ఎంట్రీ ఖాయమైంది అంటున్నారు. ప్రస్తుతం ''లాల్‌సింగ్‌ చద్దా, బంగార్రాజు'' సినిమాల్లో నటిస్తున్నారు చైతూ. చిరంజీవి డ్యూయల్ రోల్ మెగాస్టార్ చిరంజీవి, డైరెక్ట‌ర్ బాబీ కాంబినేష‌న్‌లో మైత్రీ మూవీ మేకర్స్ బ్యాన‌ర్‌పై ఓ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ చేయనున్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం ‘ఆచార్య’ మూవీతో బిజీగా ఉన్న చిరంజీవి.. ఆ వెంటనే ‘లూసిఫ‌ర్’ రీమేక్‌ ఫినిష్ చేసి బాబీ ద‌ర్శ‌క‌త్వంలో సినిమా మొదలు పెట్టనున్నారు. ఏమవుతానో ఊహించలేదన్న హాట్ బ్యూటీ తన కెరీర్ స్టార్ట్ చేసి 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తనను ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు చెప్పింది శృతి హాసన్. ''12 ఏళ్ల క్రితం ఈ రోజున నేనేంటో.. ఏమవుతానో కూడా ఊహించలేదు. ఇష్టపడిన పని చేయాలని, ప్రతిరోజు గొప్పగా ఉండాలని తపన పడేదాన్ని. ఇప్పటికీ అదే పద్దతి అనుసరిస్తూ.. ఎత్తు పల్లాలతో సంబంధం లేకుండా ప్రతిరోజు కొత్తదిగా భావిస్తాను. నా సక్సెస్‌లో ప్రేక్షకులదే కీలక పాత్ర. ప్రతి ఒక్కరికీ రుణపడి ఉంటాను'' అని తెలిపింది. రిక్షా తొక్కిన సోనూ సూద్ కరోనా కష్టకాలంలో నేనున్నా అంటూ ఆపద్బాంధవుడిగా నిలిచిన సోను సూద్ ఎన్నో సేవలు చేశారు. పేదవాడి హృదయంలో దేవుడిగా చోటు సంపాదించాడు. కాగా తాజాగా సోనూ సూద్ మిల్క్ మ్యాన్‌గా మరి రిక్షా తొక్కాడు. రైతు పశుగ్రాసం తీసుకుని వెళ్తున్న ఓ రిక్షాలో ఆ రైతుకు కుర్చోబెట్టుకొని రిక్షా తొక్కుతూ వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకున్నాడు సోనూ. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Wk1g86

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk