తాజా విస్తరణతో కేంద్ర మంత్రి మండలి స్వరూపంలో అనేక మార్పులొచ్చాయి. పెద్ద సంఖ్యలో కొత్త మంత్రులు రావడమే కాకుండా ఇప్పటికే ఉన్న మంత్రులలోనూ కొందరికి శాఖలు మారాయి. ఇప్పటి వరకు స్వతంత్ర హోదా, సహాయ మంత్రి హోదాలో ఉన్న కొందరికి కేబినెట్ మంత్రి హోదా దక్కింది. వీరిలో మన తెలంగాణ రాష్ట్రానికి చెందిన కిషన్ రెడ్డి కూడా ఉన్నారు. విస్తరణకు ముందు మోదీ మంత్రి మండలిలో 53 మంది ఉండగా ప్రస్తుతం వారి సంఖ్య 77కి చేరింది. 2018 చివర్లో తెలంగాణ అసెంబ్లీని సీఎం కేసీఆర్ రద్దు చేయండం ఆ తర్వాత ఆకస్మికంగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు రావడం అనూహ్యహంగా జరిగిపోయాయి. ఈ క్రమంలో ఎవరికి అధికారం దక్కుతుంది. ఎవరు మరోసారి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టిస్తారనే ఆలోచన ప్రతి ఒక్కరిలో మొదలైంది. ఈ ఎన్నికల్లో కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత వచ్చిన లోక్‌సభ ఎన్నికలు జరిగాయి.. ఇందులో కిషన్ రెడ్డి ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అయితే తాజాగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో కిషన్‌రెడ్డికి కేంద్రమంత్రి పదవి దక్కింది. ఆయన పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల సంరక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు అభినందనలు తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఆయన గురించి ట్వీట్ చేశారు. చిరంజీవి కూడా గతంలో పర్యాటక శాఖ మంత్రిగా పని చేశారు. కిషన్ రెడ్డికి అభినందనలు తెలిపిన చిరంజీవి.. దేశాన్ని సమగ్రంగా పర్యటించడానికి ఇది ఆయనకు దక్కిన గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. ఇలాగే కృషి చేస్తూ.. మన భారతీయ చరిత్రాత్మక సంపదను ప్రపంచదేశాలకు పరిచయం చేయాలని ఆయన ఆకాంక్షిస్తున్నట్లు అన్నారు. ఇది ఒక మంచి అనుభం మాత్రమే కాదు.. తనకు దక్కిన గొప్ప గౌరవం అని స్పష్టం చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yHya02
No comments:
Post a Comment