Thursday 15 July 2021

కొత్త కారు కొన్న షణ్ముఖ్.. ఆ ఘటనను గుర్తు చేస్తూ నెటిజన్ల ట్రోలింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. యూట్యూబ్‌లో షణ్ముఖ్ వీడియోలన్నీ కూడా వైరల్ అవుతుంటాయి. షార్ట్ ఫిలిమ్స్, డ్యాన్స్ వీడియోలతో షణ్ముఖ్ ఎక్కువగా ఫేమస్ అయ్యారు. ఇక దీప్తి సునయన విషయంతోనే షణ్ముఖ్ వెలుగులోకి వచ్చారు. బిగ్ బాస్ షోలో దీప్తి సునయన ఎక్కువగా షణ్ముఖ్ గురించి చెబుతూ ఉండేది. అలా దీప్తి సునయన షణ్ముఖ్ జోడికి విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ఎక్కడా నటించడం లేదు. ఏదో అలా ఒకటీ రెండూ షోల్లో స్పెషల్ ఈవెంట్ సందర్భంగా కలిసి పాల్గొన్నారు. తమ జంటపై ఎన్ని రూమర్లు వచ్చినా కూడా దీప్తి సునయన షణ్ముఖ్‌లు ఎక్కడా కూడా స్పందించరు. అయితే దీప్తి సునయన హద్దులు మీరి పర్ఫామెన్స్‌లు చేసిన ప్రతీసారి అందరూ షణ్ముఖ్‌ పేరును ప్రస్తావిస్తారు. అతడినే టార్గెట్ చేసి కామెంట్లు పెడుతుంటారు. షణ్ముఖ్ ఈ మధ్య మంచి సక్సెస్ కొట్టేశారు. సూర్య అనే వెబ్ సిరీస్ సూపర్ డూపర్ హిట్ అయింది. అంతకు ముందు షణ్ముఖ్ మద్యం సేవించి కారు నడపడం, ఆ కేసుకు సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఇమేజ్ డ్యామేజ్ అయింది. కొన్ని రోజులు షణ్ముఖ్‌ను అందరూ ఆడుకున్నారు. అయితే సూర్య వెబ్ సిరీస్ క్లిక్ అవ్వడంతో అందరూ ఆ ఘటనను లేవనెత్తడం మానేశారు. అయితే మళ్లీ ఆ ఘటనను అందరూ గుర్తు చేస్తున్నారు. దానికి ఓ ప్రత్యేక కారణం ఉంది. సూర్య వెబ్ సిరీస్ బాగా క్లిక్ అవ్వడంతో జోష్‌లో ఉన్న షణ్ముఖ్ కొత్త కారు కొన్నారు. దాదాపు 15 లక్షలు పెట్టి ఈ కారును కొన్నట్టు తెలుస్తోంది. ఇది నేను హై.. ఇది నా కొత్త కారు హై.. పార్టీలు లేవు హై అంటూ తన స్టైల్లో సెటైర్ వేశాడు. అయితే ఇలా కొత్త కారు కొనడం, వెనకలా నంబర్ ప్లేట్‌ను బ్లర్ చేయడంపై నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. చలాన్లు కట్టాల్సి వస్తుందని ఇలా బ్లర్ చేస్తున్నావా? ఈసారైనా మద్యం సేవించకుండా కారు నడుపు.. జాగ్రత్త అంటూ ఇలా ఎవరికి తోచినట్టుగా వారు కామెంట్లు పెడుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hGuDJN

No comments:

Post a Comment

'Didn't Know Mirch Masala Would Be...'

'She was my only choice to play Sonbai. The moment she read the script, she slipped into character.' from rediff Top Interviews ht...