Monday 19 July 2021

విజయ్ దేవరకొండపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబులను లాగుతూ ఊహించని విధంగా!

రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఎవరిపై ఎలా రియాక్ట్ అవుతారనేది ఏ ఒక్కరూ ఊహించలేరు. మనసులో ఏదీ దాచుకోకుండా, నిర్మొహమాటంగా తనకు ఏదనిపిస్తే అదే మాట్లాడటం వర్మ నైజం. ఇలా ఎన్నో సందర్భాల్లో చేసిన కామెంట్స్ చర్చల్లో నిలిచాయి. అయినప్పటికీ అవేవీ లెక్కచేయకుండా ఓపెన్‌గా ఉంటూ తనదైన దారిలోనే వెళుతున్నారు వర్మ. తన కెరీర్‌లో ఎంతో మంది స్టార్ హీరోలతో పని చేసిన వర్మ.. తాజాగా యంగ్ హీరో గురించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో '' మూవీ రూపొందుతున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ దశలో ఉండగానే ఈ సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలు చూసిన పూరి గురువు ఆర్జీవీ.. ట్విట్టర్ వేదికగా తన రివ్యూ ఇచ్చేశారు. అంతేకాదు విజయ్ దేవరకొండ స్టైల్, నటనపై కామెంట్స్ చేస్తూ మధ్యలో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవి తేజ, టైగర్ ష్రాఫ్ లాంటి స్టార్ హీరోల పేర్లు లాగేశారు. పులి, సింహం కంటే కూడా విజయ్ దేవరకొండ క్రాస్‌గా ఉన్నాడంటూనే.. పవన్ కళ్యాణ్, మహేష్, రవితేజ, టైగర్ ష్రాఫ్ వంటి స్టార్స్ కంటే కూడా విజయ్ దేవరకొండ సూపర్ క్రాస్ అని వర్మ పేర్కొనడం విశేషం. అదేవిధంగా గత రెండు దశాబ్దాల్లో విజయ్ దేవరకొండ లాంటి హీరోని చూడలేదని, ఇలాంటి సినిమాను ప్రేక్షకుల ముందుకు తెస్తున్న పూరి జగన్నాథ్, ఛార్మిలకు ప్రత్యేక ధన్యవాదాలు అంటూ వర్మ చేసిన ట్వీట్స్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ట్వీట్స్ చూసిన విజయ్ దేవరకొండ అభిమానుల్లో 'లైగర్' సినిమాపై ఉన్న ఆతృత రెట్టింపయింది. ‘సాలా క్రాస్‌ బ్రీడ్‌’ ట్యాగ్ లైన్‌తో మార్షల్‌ ఆర్ట్స్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను రియాలిటీకి దగ్గరగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకొని తెరకెక్కిస్తున్నారు పూరి జగన్నాథ్. బాలీవుడ్‌ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌తో కలిసి పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ ఫినిష్ చేశారు. ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2W1Nk2n

No comments:

Post a Comment

'We Lost So Many Things In This War'

'The war ended in 2009 and I believe the new generation of Tamils don't know what was going on there.' from rediff Top Intervi...