ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కారణంగా థియేటర్లు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో సినిమా పరిశ్రమకు దిక్కుతోచని స్థితిలో పడింది. ఈ క్రమంలో సంస్థలు పుంజుకుంటున్నాయి. అదే సమయంలో చిన్న సినిమాలు, నిర్మాతలకు ఓటీటీ సంస్థలు వరంగా మారాయి. ఎంతో కష్టపడి తీసిన సినిమాలు అలా మూలన పడకుండా ఓటీటీ సంస్థలు ఆదుకుంటున్నాయి. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇక ఈ కోవిడ్ కారణంగా.. థియేటర్స్ ఓపెన్ చేయాలా? వద్దా? చేస్తే ఎలాంటి నిబంధనలు పాటించాలనే సందేహాలు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌లో మెదులుతున్నాయి. అయితే ఆగస్ట్‌లో థియేటర్స్‌ను ఓపెన్ చేయడంపై ఓ నిర్ణయానికి రానున్నారు. థియేటర్లు తెరిచినా కూడా జనాలు మునుపటిలా వస్తారో కూడా తెలియదు. థియేటర్లు ప్రారంభించినా కూడా మొదటగా పెద్ద సినిమాలకే ప్రాధాన్యత ఉంటుందనేది తెలిసింది. ఇలాంటి తరుణంలో చిన్న సినిమాలను ఆదుకునేందకు కేరళ రంగంలోకి దిగింది. కేరళ ప్రభుత్వం చిన్న నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కేరళ ప్రభుత్వమే ఓటీటీని ప్రారంభించనుందట. ఈ విషయాన్ని కల్చర్ ఎఫైర్స్ మినిస్టర్ సాజి చెరియన్ వెల్లడించారు. అన్ని రకాల సినిమాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. మరి కేరళ బాటలో మన తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయాణిస్తాయేమో చూడాలి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/368LvSS
No comments:
Post a Comment