అది ఒక అద్భుత కట్టడం. ఎన్నిసార్లు చూసిన తనివి తీరని కళా వైభవం అది. ఆ శిల్పకళా సౌందర్యం.. ఏ మూల చూసినా కళ్లు తిప్పుకోలేని అందం. ఎంతసేపు ఉన్న తనివితీరని వైభవం పర్యాటకులను కట్టిపడేస్తుంది. అదే ఓరుగల్లు రాజులు కాకతీయులు కట్టించిన రామప్ప దేవాలయం. శిల్పి రామప్ప పేరుతో ప్రఖ్యాతిగాంచిన ఈ ఆలయంలో రామలింగేశ్వర స్వామి నిత్యారాధణలు అందుకుంటూ.. ప్రజలను కరుణిస్తున్నాడు. అలాంటి ఆలయానికి త్వరలో ఓ అరుదైన ఘనత దక్కనుంది. ప్రపంచ వారసత్వ సంపదగా తెలంగాణ నుంచి ఈ దేవాలయం ఎంపిక అయింది. ఈ విషయంపై టాలీవుడ్ రౌడీ బాయ్ స్పందించారు. ప్రస్తుతం విజయ్, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘’ సినిమాలో బిజీగా ఉన్నాడు. బాలీవుడ్ యువ హీరోయిన్ అనన్య పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై పూరీ జగన్నాథ్, ఛార్మి కౌర్, కరణ్ జోహర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే స్వరాష్ట్రంపై ఎంతో అభిమానం ఉన్న విజయ్.. రామప్ప వరల్డ్ హెరిటేజ్‌కి ఎంపిక కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. ‘చరిత్ర గురించి తెలుసుకోవడం ఎప్పుడు ఆసక్తికరంగా ఉంటుంది. కాకతీయ రాజులు నిర్మించిన 800 సంవత్సరాల రామప్ప దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద రేస్‌లో ఉండటం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ విజయ్ ట్వీట్ చేశారు. రామప్ప దేవాలయంలోని ఓ సాలభంజిక ఫోటోని ఆయన రీట్వీట్ చేశారు. అలా స్వరాష్ట్రంలో ఉన్న ఓ అద్భుతకట్టడంపై విజయ్ తన ఆసక్తిని ప్రదర్శించారు. ఈ అంశంపై స్పందించిన తొలి హీరోగా కూడా విజయ్ నిలిచారు. మరి రామప్పకి ఆ గుర్తింపు వస్తే విజయ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సిందే.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3k79uKn
No comments:
Post a Comment