Monday 12 July 2021

నా చిన్నతనంలో ఆ పని చేసేవాడిని పెళ్లి చేసుకోవాలనుకున్న: తేజస్వి

తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలో చాలాకాలంగా కొనసాగడం చాలా కష్టం. ఇక్కడ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం ఉత్తరాది అమ్మాయిలను హీరోయిన్లుగా తీసుకోవడానికే ప్రాధాన్యతను ఇస్తారు. కానీ, కొందరు తెలుగు అమ్మాయిలు మాత్రం తమకు దొరికిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. ఇండస్ట్రీలో స్థిరంగా కొనసాగుతున్నారు. అలా ఇండస్ట్రీలో కొనసాగుతున్న బ్యూటీ తేజస్వీ మాదివాడ. ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించిన ఆమె.. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ‘ఐస్‌క్రీమ్’ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి అందరికి షాక్ ఇచ్చింది. ఇక బిగ్‌బాస్ షో తర్వాత ఈ భామకి మంచి పాపులారిటీ పెరిగిపోయింది. ఇక సోషల్‌మీడియాలో ఈ భామ చేసే హంగామా అంతా ఇంతా కాదు.. ఒకప్పుడు మామూలుగా ఫోటోలు పోస్ట్ చేసే ఈ భామ.. ఈ మధ్యకాలంలో హాట్ ఫోటోలతో సోషల్‌మీడియాను కుదిపేస్తుంది. మొన్నీ మధ్యే బికినీ ఫోటోలతో కూడా అభిమానులకు కావాల్సినంత ట్వీట్ ఇచ్చింది. ఈ భామ కొన్ని పిక్స్ పోస్ట్ చేస్తే చాలు అవి కొంత సమయంలోనే వైరల్ అవుతున్నాయి. తేజస్వి ఎప్పుడు పిక్స్ పెడుతుందా.. అంటూ ఎదురుచూసేవాళ్లు చాలా మందే ఉన్నారు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతలా సోషల్‌మీడియాలో పాపులారిటీ సంపాదించుకుంది ఈ భామ. తాజాగా తన పెళ్లికి సంబంధించి ఆసక్తికర విషయాన్ని సోషల్‌మీడియా ద్వారా వెల్లడించింది ఈ బ్యూటీ. చిన్నతనంలో తను ఎలాంటి వ్యక్తి పెళ్లి చేసుకోవాలని అనుకుందో బయటపెట్టింది. తనకు పానీపూరీ అంటే ఎంతో ఇష్టమని.. అందుకే ఆ పానీపూరీ చేసే వ్యక్తినే తాను పెళ్లి చేసుకోవాలని చిన్నతనంలో ఆశపడినట్లు పేర్కొంది. అయితే ఇప్పుడు తాను చిన్నపిల్ల కాదు కాబట్టి అసలు పెళ్లే వద్దు అని నిర్ణయం తీసుకున్నాను అని పేర్కొంది. అంతేకాదు.. దీనికి పానీపూరి బండిని తాను తోస్తున్నట్లు ఉన్న ఓ పిక్‌ని కూడా షేర్ చేసింది తేజస్వి. ఇది నెటిజన్లు విశేషంగా ఆకట్టుకుంటుంది. ‘అవును నేను అలాగే అనుకున్నాను’.. ‘ఏంటీ ఆ బండిని ఇంటికి తీసుకువెళ్తున్నావా’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2VxvcND

No comments:

Post a Comment

'Will Keep Working To Grow Value Of New Businesses'

'Margins will be an outcome of that. They will likely remain somewhat range-bound.' from rediff Top Interviews https://ift.tt/mfch...