సుమ, ప్రేమ వ్యవహారం గురించి అందరికీ తెలిసిందే. రాజీవ్ వివాహా బంధం గురించి ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వినిపిస్తూనే ఉంటుంది. ఇద్దరూ విడిపోయారని, వేరుగా ఉంటున్నారని రకరకాలుగా వార్తలు వస్తుంటాయి. కానీ తామిద్దరం మధ్య అంతటి దూరం రాలేదని, చిన్నచిన్న గొడవలు సంసారంలో సహజమని రాజీవ్ కనకాల చెబుతుంటారు. అయితే తాజాగా రాజీవ్ కనకాల ఓ ఇంటర్వ్యూలో తమ ప్రేమ కథ గురించి వివరించారు. ప్రేమ కథ ఎలా మొదలైంది? తొలి చూపులు ఎక్కడ కలిశాయో అన్నింటినీ వివరించారు. ‘మాది అరేంజ్డ్ అనే మాటే లేదు.. ప్రేమ పెళ్లే. దూరదర్శన్‌లో ఓ పైలెట్ ఎపిసోడ్ షూట్ చేసి దాని రషెస్ కోసం త్రి స్టార్ ఎలక్ట్రానిక్స్ వద్దకు వెళ్లాను. అప్పట్లో అక్కడ లైన్ కూడా కట్టేవారు. పక్కనే దర్శకుడు మీర్ గారున్నారు. నేను రూంలోకి వెళ్తున్నా.. అప్పుడే సుమ కూడా వచ్చారు. అదే ఫస్ట్ టైం చూడటం. ఆ సమయంలోనే తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు అనే పాట లోపల మార్మోగింది. అయితే ఆమె 1991 నుంచి టీవీ రంగంలో ఉన్నారట. కానీ నేను ఆమెను 1994లో చూశాను. బాగుందే ఈ అమ్మాయి.. ఇంత వరకు ఆమెను చూడలేదు.. ఒక్క సీరియల్ కూడా చేయలేదే అని అనుకున్నాను. జీకే మోహన్ గారు ఓ ఎపిసోడ్ గురించి నన్ను అడిగారు. మాధురి అని జరిగిన ఆ ఎపిసోడ్‌లో నా పక్కన సుమ నటించారు. అయ్యో ఒక్క రోజే ఉందేంటి? ఇంకా ఒక్క రోజు ఉంటే పడేసే వాడిని కదా? అనుకున్నాను. నేను కోరుకున్నట్టే ఆ షూటింగ్ ఇంకా ఒక్క రోజు పెరిగింది. కానీ అక్కడ నా మాయాజాలం ఏమీ పని చేయలేదు. ఏం మాట్లాడలేదు. మీర్ దర్శకత్వంలో వచ్చిన జీవనరాగం సీరియల్‌లో అసలు కథ మొదలైంది. అందులో ఐదు రోజుల పెళ్లి అనే కాన్సెప్ట్ ఉంది. దాంట్లో వరుడిగా నేను నటించారు. వధువుగా ఓ అమ్మాయి వచ్చింది. కానీ రెండో రోజే మాయమైంది. శోభనం సీన్ అని చెప్పడంతో ఆ మరుసటి రోజు ఆమె రాలేదు. దీంతో సుమను పెళ్లి కూతురిగా తీసుకొచ్చారు. మళ్లీ మొదటి నుంచి షూట్ చేశాం. అక్కడే పడేశాను. ఆ సమయంలోనే సుమకు ప్రపోజ్ చేశాను. మొదట నో చెప్పారు. కళ్లలో నీళ్లు వచ్చేశాయి. ఏడ్చేశాను. యాక్టింగ్ స్కూల్‌లో అలాంటివన్నీ నేర్చుకుంటాం కదా. నో చెప్పడంతో ఆ తరువాత రెండు మూడు రోజులు సెట్‌లో ఆమెకు కనిపించలేదు. నాల్గో రోజు సెట్‌కు వెళ్లాను. ఆమె కారు తీసుకురాలేదు. ఆటోలో పంపిస్తామని ప్రొడక్షన్ వాళ్లు అంటే.. వద్దులేండి రాజీవ్ గారి కారు ఉందిగా వెళ్తాను అని చెప్పారట. అలా తమ ప్రేమ కథ మొదలైంద’ని రాజీవ్ కనకాల చెప్పుకొచ్చారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ygG3d2
No comments:
Post a Comment