Friday 9 July 2021

17 ఏళ్లకు నెరవేరిన అర్జున్ కల.. ఆయన నిర్మించిన ఆంజ‌నేయ‌ స్వామి గుడి ప్రత్యేకత ఇదే!!

యాక్షన్ కింగ్ అర్జున్ తన 17 ఏళ్ల కలను నెరవేర్చుకున్నారు. భక్తిభావాలు ఎక్కువగా ఉండే అర్జున్.. గతంలో టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన సినిమా 'శ్రీ ఆంజనేయం' హనుమంతుడి పాత్ర పోషించి ఆకట్టుకున్నారు. హనుమంతుడిపై ఉన్న అమితమైన భక్తితో ఆ పాత్రలో లీనమై పలువురి ప్రశంసలందుకున్నారు. ఆ వెంటనే ఆంజ‌నేయ‌ స్వామికి స్వయంగా తానే ఓ గుడి కట్టించాలని పూనుకున్న అర్జున్ దాదాపు 17 ఏళ్ల పాటు శ్రమించి ఆ కల నెరవేర్చుకున్నారు. ఎన్నో ప్రత్యేకతలున్న ఈ టెంపుల్ ఇటీవలే ప్రారంభమైంది. కేవలం తన సొంత ఖర్చులతోనే నటుడు అర్జున్ సర్జా ఈ ఆలయ నిర్మాణానికి పూనుకొని ఎంతో భక్తి భావంతో విజయవంతంగా ఈ సత్కార్యాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతం భక్తుల సందర్శనార్థం ఆంజ‌నేయ‌ స్వామి ఆలయం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకొని కేవలం తన కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ ఆలయాన్ని ప్రారంభించారు అర్జున్. పురోహితుల వేదమంత్రాల నడుమ కుంభాభిషేకం నిర్వహించి.. భక్తులంతా ఈ కార్యక్రమాన్ని వీక్షించ‌డానికి లైవ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. సంప్రదాయ దుస్తుల్లో పంచెకట్టుతో కనిపించి భక్తి పారవశ్యంలో మునిగిపోయారు అర్జున్. ఆలయంలో కొలువుదీరిన ఆంజనేయ స్వామి విగ్రహానికి అభిషేకం నిర్వహించి పండితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఆవిష్కరించారు. ఈ విగ్రహ నిర్మాణంలో అర్జున్ భాగం కావడం పట్ల హనుమాన్ భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చెన్నై సమీపంలో గల ఈ ఆల‌యానికి 2005 సంవత్సరంలో పెజావ‌ర్ సీర్ విశ్వేత తీర్థ చేతుల మీదుగా శంకుస్థాప‌న చేయించారు అర్జున్. క‌ర్ణాట‌క శిల్పి అశోక్ గుడిగ‌ర్ సార‌థ్యంలో హ‌నుమంతుడి ఏక‌శిలా విగ్రహాన్ని ప్ర‌తిష్ఠింప‌ జేశారు. ఇది 35 అడుగుల ఎత్తైన భారీ హనుమాన్ విగ్రహం. ఆలయం అంతా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yFP9zU

No comments:

Post a Comment

'I Feel I Fail Shah Rukh'

'I'm happy piggybacking on his stardom.' from rediff Top Interviews https://ift.tt/b1euMKc