Saturday 18 July 2020

YS Jagan: నేను కరోనా ట్రీట్మెంట్ తీసుకున్నా.. అక్కడ ఏం పెట్టారు? ఎలా చూశారు: నటుడు ప్రభాకర్ వీడియో వైరల్

సూర్యకాంతం, మట్టిగాజులు సీరియల్స్ యాక్టర్ ప్రభాకర్ ఇటీవలే కరోనాను జయించి కోలుకున్నారు. ఈ సందర్భంగా తనకు ఎలాంటి వైద్యం అందించారు.. ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారో తెలియజేస్తూ ఫేస్ బుక్‌లో ఓ వీడియోను షేర్ చేశారు ప్రభాకర్. కరోనా వస్తే వైద్యం సరిగా అందడం లేదంటూ వస్తున్న అపోహలపై ఆయన తన అనుభవాన్ని తెలియజేశారు ప్రభాకర్. ఇంతకీ కరోనా రోగులకు క్వారంటైన్‌లో ట్రీట్ మెంట్ ఎలా జరుగుతుంది.. వారికి ఎలాంటి ఆహారం అందిస్తున్నారు.. ఏ టైంలో ఆహారం తీసుకోవాలో ఆయన మాటల్లోనే విందాం. ‘నా పేరు ప్రభాకర్.. నేను టీవీ సీరియల్స్‌లో యాక్ట్ చేస్తుంటాను. ఈమధ్యనే నాకు కరోనా సోకింది. తిరుపతి పద్మావతి నిలయంలో 12 రోజుల పాటు క్వారంటైన్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుని డిచ్చార్జ్ అయ్యాను. ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉన్నాను. అయితే చాలా మంది నా ఫ్రెండ్స్, బంధువులు అక్కడ ఏం ట్రీట్ మెంట్ తీసుకున్నావ్ అని అడుగుతున్నారు. ఏ ఫుడ్ తీసుకున్నావ్ అని అడుగుతున్నారు. నేను కరోనాని జయించాను అంటే కొంతమంది నాకు చేసిన హెల్ప్ వల్ల.. వాళ్లకు థాంక్స్ చెప్పడానికే ఈ వీడియో చేస్తున్నా. క్వారంటైన్‌లో మా దినచర్య ఉదయం 6 గంటలకు న్యూస్ పేపర్‌తో ప్రారంభం అవుతుంది. 7 గంటలకు అల్లం టీ ఇచ్చేవారు. 7.30కి సిస్టర్స్ వచ్చి ట్యాబ్లెట్స్ ఇచ్చేవారు. 8 గంటలకు డిఫిన్ పెట్టేవారు. డిఫిన్ తరువాత ఆవిరి పట్టుకోవడం గార్నింగ్ చేసుకోవడం, వేడి నీళ్లతో స్నానం చేయడం లాంటివి చేసేవాళ్లం. 10 గంటలకు డాక్టర్ వచ్చేవారు.. అప్పుడు మనకు ఏదైనా ఆరోగ్యపరమైన సమస్య ఉంటే అది క్లియర్ చేసేవారు. 11-12 మధ్య ఒక వ్యక్తి వచ్చి మనకు కావాల్సిన వాటిని ఇచ్చి వెళ్లేవాడు. వాటర్, సబ్బులు, పేస్ట్ ఇలాంటివి ఏమైనా కావాల్సి ఆయనకు చెప్తే వెంటనే ఆ వ్యక్తి వాటిని సమకూర్చేవాడు. అలాగే ఆ క్వారంటైన్ సెంటర్‌లో ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు.. ఏదైనా సమస్య ఉండి దాన్ని ఆ గ్రూప్‌లో చెప్తే వెంటనే పరిష్కరించేవారు. మధ్యాహ్నం భోజనం ఉండేది. 3 గంటలకు కషాయం ఇచ్చేవారు. 4-5 మధ్యలో రాగిజావ,డ్రై ఫ్రూట్స్ ఇచ్చేవారు. 7.30 టిఫిన్ లేదా రైస్ ఐటమ్ పెట్టేవారు. ఇందులో టమోటా రైస్, వెజ్ బిర్యానీ ఉండేది. అలాగే డైలీ మూడు పూట్లా మూడు ఎగ్స్ ఇచ్చేవారు. ఇలా టైం టు టైం పేషెంట్‌కి ఏం కావాలో అది ఇస్తూ.. చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. మాకు ఎంతో సేవచేశారు డాక్టర్లు, పారిశుధ్యకార్మికులు, నర్సులు. ఆ హాస్పటల్ మెయిటైన్ చేస్తున్న లక్ష్మీ మేడమ్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ధన్యవాదాలు. వాళ్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ.. ఎంతో మంది కరోనా పేషెంట్స్‌ని బాగుచేస్తున్నారు. ఇంత అద్భుతంగా ఎలా చేస్తున్నారని వాళ్లని నేను అడగడం జరిగింది. వాళ్లు ఒకటే చెప్పారు.. ఇది చంద్రగిరి నియోజక వర్గ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుంది. ఆయన ఒకటే చెప్పారు.. కరోనా వచ్చిన పేషెంట్ తిరిగి త్వరగా కోలుకోవడానికి ఏం చేయాలో అన్నీ తప్పకుండా పాటించండి.. వాళ్లకు చేయాల్సింది చేయండి. ఎట్టిపరిస్థితుల్లోనూ కాంప్రమైజ్ కావొద్దు అని చెప్పారని అన్నారు. నిజంగానే ఆయన కోరుకున్నట్టుగా చాలా అద్భుతంగా చేస్తున్నారు.. ఆయన సేవల వల్లే నేను నాతో పాటు ఎంతోమంది కోలుకుంటున్నారు’ అంటూ వైసీపీ ఎమ్మెల్యేకి, ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వీడియో షేర్ చేశారు నటుడు ప్రభాకర్. అయితే ఈ వీడియోను వైసీపీ అభిమానులు తమ పార్టీకి సంబంధించిన గ్రూప్స్‌లలో షేర్ చేస్తున్నారు. ఒక వైపున జగన్ ఫొటో మరోవైపు ప్రభాకర్ ఫొటోని పెట్టి మరీ ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30hWKFq

No comments:

Post a Comment

'We Lost So Many Things In This War'

'The war ended in 2009 and I believe the new generation of Tamils don't know what was going on there.' from rediff Top Intervi...