Wednesday 15 July 2020

KCR: సచివాలయం వాస్తు వల్లే ‘దొర’ ఆరోగ్యం చెడింది: కేసీఆర్‌పై తెలుగు హీరోయిన్ షాకింగ్ పోస్ట్

() కూల్చివేత అంశం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. రాష్ట్రప్రభుత్వం నూతన సచివాలయాన్ని నిర్మించనున్న క్రమంలో చేపట్టిన పాత భవనాల కూల్చివేత పనులకు శ్రీకారం చుట్టుగా.. హైకోర్ట్‌లో స్టేల వరకూ వెళ్లింది. అయితే పాత భవనాల కూల్చివేతను ప్రతిపక్ష పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. నిజాం రహస్య నిధుల కోసమే అంటూ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. నిజాం పాలకులు అప్పట్లో తమ నిధులను 5 రహస్య స్థావరాల్లో దాచారని వాటిలో మింట్ కాంపౌండ్, హోంసైన్స్ కాలేజీ, సెక్రటరేట్ జీ బ్లాక్ ఉన్నాయని.. జీబ్లాక్ కింద గుప్త నిధులు ఉన్నట్లు దాదాపు అన్ని ఆంగ్ల పత్రికలు రాశాయంటూ సంచలన ఆరోపణలు చేశారు రేవంత్. .ఈ గుప్త నిధుల కోసమే కేసీఆర్ పాత సచివాలయ భవనాలను కూల్చివేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు రేవంత్. అయితే ఇదే ఇష్యూపై మరో అడుగు ముందుకు వేస్తూ.. బీజేపీ యువ నాయకురాలు, ప్రముఖ సినీ నటి కేసీఆర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఈమె ఏకంగా సచివాలయం కూల్చివేతకు కేసీఆర్ ఆరోగ్యంతో ముడిపెడుతూ తన ఫేస్ బుక్‌లో షాకింగ్ పోస్ట్ పెట్టింది. ఉస్మానియా ఆసుపత్రిలో వర్షం నీరు రావడంతో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యారు. అక్కడ రోగులు పడుతున్న కష్టాన్ని కళ్లకు కట్టాయి. ఈ వీడియోలు చూసిన చాలా మంది.. కేసీఆర్ గారూ!! ఈ దుస్థితి చూసిన తరువాత అయినా మనకు కావాల్సింది సచివాలయమా? లేక వైద్యాలయమా? ప్రజలు పిట్టల్లా రాలిపోతుంటే పాలకులేమో వాటి మీద దృష్టి పెట్టాల్సింది పోయి రాజుల వలె వాళ్ళ చరిత్ర చెక్కుకునే నిర్మాణాలపైనా దృష్టిసారిస్తారా? అంటూ తీవ్ర విమర్షలు వినిపించాయి. అయితే ఇదే వీడియోలను ఫేస్ బుక్ ద్వారా షేర్ చేసిన మాధవీలత.. తెలంగాణ ముఖ్యమంత్రిని ‘దొర’తో పోల్చుతూ ఇన్ డైరెక్ట్ కామెంట్స్ చేసింది. సెక్రెటరేట్ వాస్తు ప్రభావం వల్ల.. ‘దొర’కి ఆరోగ్యం బాగుండటం లేదంట.. అందుకే కొత్త బిల్డింగ్ ప్లాన్. మరి పేషెంట్స్ ఉండే హాస్పటల్స్ ఇలా ఉండొచ్చా??? ఈ వాస్తులో నీటి దోషం ఉంది అయినా పర్లేదా? అంటూ సంచలన కామెంట్స్ చేసింది. ఇక తనకు ఎప్పటిలాగే ఏ పోస్ట్ పెట్టినా ఎలాగూ నెగిటివ్ కామెంట్స్ వస్తాయని ముందే భావించిన ఈమె.. ఇక్కడ నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ల ఫ్యామిలీ ఇదే ప్లేస్‌లో ఉంటే.. అప్పుడు కడుపు మూతి అన్నీ కాలతాయి. దూరంగా ఉండి కారు కూతలు కూస్తే కాదు’ అంటూ నెగిటివ్ కామెంట్స్ చేసేవారిని ముందే హెచ్చరించింది మాధవీలత. ఆమె హెచ్చరికల్ని లైట్ తీసుకున్న చాలా మంది నెటిజన్లు ‘మీలాంటి అవివేకపు పోస్టింగ్స్‌తో బీజేపీకి మైలేజ్ కంటే డ్యామేజ్ ఎక్కువ’ అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు. ‘ఒకర్ని అనే ముందు మీ బీజేపీ పార్టీ దేశాన్ని ఎలా పాలిస్తున్నారో తెలుసుకోండి.. అయినా ఏది పడితే అది మాట్లాడే ముందు కేసీఆర్ ఏం చేస్తానన్నారో తెలుసుకో.. మొదట కేసీఆర్ ఉస్మానియా హాస్పటల్‌ ప్లేస్‌లో కొత్త బిల్డింగ్ కడతా అన్నారు. కాని మీ పార్టీ వాళ్లు కోర్టుకి వెళ్లి అడ్డుకున్నారు అది కూడా తెలియకుండా నువ్ కామెంట్స్ చేస్తున్నావ్.. మీ కళ్ళు బైర్లు కమ్మేలా మీ లీడర్లు ఉస్మానియా మీద చేసిన దొంగ రాజకీయాలు చుపిస్తాము.. వీడియో, ఫొటో ఆప్షన్ మీ ఫేస్ బుక్‌లో ఇవ్వండి’ అంటూ మాధవీలతపై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు టీఆర్ఎస్ శ్రేణులు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/38ZwfIE

No comments:

Post a Comment

'Looking to export from India in next 5 years'

'All competitors are sourcing within the country, so we'll be at the same level of competition.' from rediff Top Interviews ht...