కరోనా వైరస్ దెబ్బ అన్ని రంగాలపై బాగానే పడింది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్‌తో అన్ని రంగాలు కుదేలయ్యాయి. ఇటు సినీ పరిశ్రమలో కూడా అనేకమంది ఉపాధి కోల్పోయారు. దాదాపు వందరోజులకు పైగా షూటింగ్స్ ఆగిపోయాయి. ఇంకా కూడా ఎప్పటి నుంచి సినిమాలు సెట్స్ పైకి వెళ్తాయనేది స్పష్టత లేదు. దీంతో సినీ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇప్పటికే చాలా మంది తమ బతుకుదెరువు కోసం రకరకాల ప్రత్యామ్నాయ ఉపాధి వెతుక్కుంటున్నారు. కొంత మంది నటులు షూటింగ్స్ లేక కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ కనిపించారు. తాజాగా ఓ దర్శకుడు సినిమాలు లేక ఏకంగా కిరాణ కొట్టు పెట్టుకోవాల్సి వచ్చింది. సినిమాలు తీసే అవకాశం లేకపోవడంతో అతడు కొత్త వ్యాపారం ప్రారంభించాడు. చెన్నైకి చెందిన సినీ దర్శకుడు ఆనంద్ పదేళ్లకు పైగా సినిమా రంగంలోనే ఉన్నారు. ఆయన ఎన్నో సినిమాలు కూడా తీశారు. ఆనంద్ గతంలో ‘ఓరు మజాయ్ నాంగు సారాల్’ మరియు ‘మౌనా మజాయ్’ వంటి బడ్జెట్ చిత్రాలతో ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ‘తునింతు సీ’చిత్రం చివరి దశలో ఉంది. కేవలం రెండు పాటలు తప్ప ఈ చిత్ర నిర్మాణం మొత్తం పూర్తయింది. అయితే కరోనా కారణంగా ఆయన తీస్తున్న సినిమాలు నిలిచిపోయాయి. దీంతో కుటుంబ పోషణ భారం కాకుండా ఉండేందుకు ఆనంద్ కిరాణ కొట్టు తెరిచాడు. పదేళ్లకు పైగా సినిమా రంగంలో ఎన్నో సినిమాలు చేసిన ఆయన ఇలా చేయడం ఇప్పుడు తమిళ చిత్ర పరిశ్రమలో ఆసక్తిగా మారింది. తన దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో ఖాళీగా ఉండలేక స్నేహితుడి సాయంతో కిరాణ షాపు తెరిచినట్టు చెప్పాడు. దీంట్లో నిత్యావసరాలను తక్కువ ధరలకే అమ్ముతున్నట్టుగా చెబుతున్నాడు. సినిమా హాల్స్ తెరిచి, షూటింగ్స్ ప్రారంభం అయ్యే వరకు ఇలా చేయక తప్పదని పేర్కొన్నాడు. బాలీవుడ్‌లో ఇప్పటికే కొందరు నటులు డబ్బులు లేక కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gqGqIV
No comments:
Post a Comment