Thursday 23 July 2020

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఇప్పుడొస్తే ఏ ఉపయోగం.. టీడీపీతో కట్, వస్తే సింగిల్‌గానే: పృథ్వీ

2019 ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాభవం తరువాత ఆ పార్టీ తిరిగి పూర్వవైభవం అందిపుచ్చుకోవాలంటే పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి మనవడు జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగాల్సిందే అని సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. స్వర్గీయ నందమూరి తారకరామారావు స్థాపించిన పార్టీని గాడిలో పెట్టే సత్తా ఒక్క జూనియర్ ఎన్టీఆర్‌కి మాత్రమే ఉందని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. తాతకి తగ్గ మనువడిగా మంచి వ్యాక్చాతుర్యంతో ప్రజల్ని ఆకట్టుకునే స్పీచ్‌లు ఇవ్వడంతో దిట్ట అయిన జూనియర్ వస్తేనే పార్టీకి పురోగతి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ భవిష్యత్ నాయకుడిగా ఉన్న ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్‌కి మాస్ లీడర్‌గా ప్రజల్లో గుర్తింపులేదని గత ఎన్నికల్లో తేలిపోయింది. పైగా మాట్లాడే విధానం, హావభావాలు, జనంలో ఉన్న ఫాలోయింగ్ ఎలా ఏ రకంగా చూసుకున్నా.. ఎన్టీఆర్‌దే పైచేయి కావడంతో ఎన్టీఆర్ పార్టీలోకి రావాలని పగ్గాలు చేతపట్టాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అయితే పాలిటిక్స్‌లోకి రావాలని కోరుకుంటున్న ఎన్టీఆర్ ఫ్యాన్సే ఆయన్ని చెడగొడుతున్నారంటూ కామెంట్స్ చేశారు ప్రముఖ కమెడియన్, మాజీ ఎస్వీబీసీ చైర్మన్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ. అయినా ఆయన ఇప్పుడొచ్చినా చేసేది ఏం ఉండదు అంటూ వ్యాఖ్యానించారు. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలని ఆయన ఫ్యాన్స్ బలంగానే కోరుకుంటున్నారు కాని.. ఈ విషయంలో ఆయన ఫ్యాన్సే ఆయన్ని చెడగొడుతున్నారు. ఆయన అద్భుతమైన నటుడు.. తాత మాదిరి అద్భుతమైన పాత్రలు పోషించగలిగే సత్తా ఉంది ఆయనలో. బ్రహ్మాండమైన పాత్రలు చేసే ఎన్టీఆర్... ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి ఏం చేస్తారు? ఎన్టీఆర్‌ది చిన్న ఏజ్.. ఇలాంటివన్నీ చెప్పి ఆయన మైండ్ పాడు చేయకండి. ఒక యాభై ఏళ్లు దాటిన తరువాత రాజకీయాల్లోకి వస్తే ఒక అర్థం ఉంటుంది. ఆయన రాజకీయాల్లోకి వస్తే సినిమా రంగం ఏమైపోవాలి. రాబోయే ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ తరుపున రంగంలోకి దిగితేనే కాస్తో కూస్తో సీట్లు వస్తాయని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు సరే.. కాని ఎన్టీఆర్ పాలిటిక్స్‌‌కి విడిగానే వస్తాడు.. ఆయన స్కీమ్ వేరే. టీడీపీ వాళ్లతో కలిసిరారు’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు పృథ్వీ. Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/39ns6P2

No comments:

Post a Comment

The Spy Who Became A Farmer

'Everything about farming is enjoyable and relaxing.' from rediff Top Interviews https://ift.tt/xBDjVyT