ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజల్ని వణికిస్తోన్న వైరస్ కరోనా. ప్రస్తుతం ఈ వైరస్ అనేక మందిని వెంటాడుతోంది. కొందరి ప్రాణాల్ని సైతం బలితీసుకుంటుంది. ముఖ్యంగా అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులు ఇప్పటికే ఈ వైరస్ బారిన పడిన విషయం తెలిసిందే. పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇప్పటికే కొన్ని వేల మంది ప్రజలు ఈ కరోనా కారణంగా కన్నుమూసారు. తాజాగా హాలీవుడ్ నటుడు నిక్ కార్డెరో కరోనా కారణంగా కన్నుమూశారు . వైరస్‌తో 90 రోజుల సుదీర్ఘ పోరాటం చేసిన తర్వాత ఆదివారం ఆయన ప్రాణాలు విడిచారు . 41 యేళ్ల నిక్ ఏప్రిల్ ప్రారంభంలో కరోనా బారిన పడ్డారు. దీంతో లాస్ ఏంజిల్స్‌లోని సెడార్స్ సినాయ్ మెడికల్ సెంటర్‌లో ఉంటూ ఆయన చికిత్స తీసుకున్నారు. ఈ క్రమంలో గత నెల అతని కుడికాలిలో రక్తం గడ్డం కట్టడంతో వైద్యులు ఆయన కాలును సైతం తొలగించారు. తాజాగా అతని ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో ఆదివారం ఆయన తుది శ్వాస విడిచారు. కరోనా కారణంగా ఇప్పటికే హాలీవుడ్‌కు చెందిన అనేకమంది నటులు చనిపోయారు. ఇటు బాలీవుడ్‌లో కూడా కరోనా కలకలం రేపింది. అనేకమంది ప్రముఖులు ఈ వైరస్ బారిన పడ్డారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ వాజిద్ ఖాన్ కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్‌లో కూడా కరోనా వైరస్ కారణంగా ప్రముఖ నిర్మాత పోకూరి రామారావు మృతి చెందారు. రామారావు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. ఆయన వయసు 64 ఏళ్లు. ఈతరం ఫిలింస్ బ్యానర్‌పై తెరకెక్కిన సినిమాలకు రామారావు సమర్పకుడిగా వ్యహహరించేవారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3iIRi70
No comments:
Post a Comment