
కమెడియన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగిన తన సినిమాలతో కన్నా వివాదాస్సద వ్యాఖ్యలతోనే ఎక్కువగా వార్తల్లో కనిపిస్తుంటాడు. పలువురు సినీ ప్రముఖులు బండ్ల గణేష్ తమను మోసం చేశాడంటూ ఇటీవల ఆరోపించారు. అంతేకాదు నిర్మాత, బిజినెస్‌మేన్ పీవీపీ అయితే బండ్ల గణేష్ తన మనుషులను ఇంటికి పంపించి బెదిరింపులకు దిగాడంటూ కేసుకు పెట్టాడు. Also Read: ఈ కేసులో బుధవారం బండ్ల గణేష్‌ను అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అదే సమయంలో ముంబైకి చెందిన ఓ ఫైనాన్షియర్‌ను మోసం చేసిన కేసులో కూడా గణేష్‌ను అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పందించారు. `నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదు విచారణ కోసం పిలవడం జరిగింది చట్టం పై గౌరవంతో వాళ్లు సహకరిస్తున్నారు నన్ను అరెస్టు చేస్తే నేను మీకు తెలియజేస్తాను మీ బండ్ల గణేష్` అంటూ ట్వీట్ చేశాడు. అయితే గణేష్ తనను అరెస్ట్ చేయలదని చెపుతున్నా సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతున్న వీడియోలు చూస్తే మాత్రం అలా అనిపించటం లేదు. పోలీసులు బలవంతంగా బండ్ల గణేష్‌ను తీసుకెళుతున్నట్టుగానే అనిపిస్తుంది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన టెంపర్ సినిమా విషయంలో ఈ వివాదం మొదలైంది. బండ్ల గణేష్ నిర్మించిన ఈ సినిమాక పీవీపీ ఫైనాన్సియర్‌గా ఉన్నారు. ఈ సినిమాకు పీవీపీ 30 కోట్ల వరకు ఫైనాన్స్ చేశారు. అయితే సినిమా విడుదల సమయంలో కొంత మొత్తాన్ని వెనక్కి ఇచ్చిన గణేష్ మిగతా మొత్తానికి చెక్కులు ఇచ్చారు. అయితే ఈ వివాదంలో పీవీపీ గణేష్ 7 కోట్లు తిరిగి ఇవ్వాల్సి ఉంది. ఆ డబ్బు తిరిగి ఇవ్వమని పీవీపీ ఒత్తిడి చేయటంతో గణేష్ బెదిరింపులకు దిగాడని పీవీపీ ఆరోపిస్తున్నారు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2N75l7o
No comments:
Post a Comment