Wednesday, 23 October 2019

నా గురించి ఎవరు చెప్పినా అది అబద్ధమే : రానా దగ్గుబాటి

యంగ్‌ హీరో రానా తన ఆరోగ్య పరిస్థితిపై మరోసారి ఆసక్తికరంగా స్పందించాడు. కొంతకాలంగా రానా హెల్త్‌ పరంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడన్న ప్రచారం జరిగుతోంది. రానా మరీ బక్కచిక్కిపోవటం, దీనికి తోడు చాలా కాలం షూటింగ్‌లకు బ్రేక్‌ ఇచ్చి విదేశాల్లోనే ఉండిపోవటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే ఈ వార్తలను రానా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చిన అభిమానులు మాత్రం రానా వ్యాఖ్యలతో సంతృప్తి చెందలేదు. గతంలో రానా తండ్రి సురేష్ బాబు మాట్లాడుతూ రానా హెల్త్‌ విషయంలో కొంత ఇబ్బంది ఉంది. ప్రస్తుతం అబ్జర్వేషన్‌లో ఉన్నాడంటే కామెంట్ చేశాడు. అయితే ఆ తరువాత కూడా రానా తన హెల్త్‌ బానే ఉందంటూ వీడియో మెసేజ్‌లు ట్వీట్లు చేశాడు. ఒక దశలో రానా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని, విదేశాల్లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌ సర్జరీ జరుగిందన్న ప్రచారం జరిగింది. తాజాగా రానా సినిమాలపై కూడా రకరకాల ప్రచారం జరుగుతోంది. Also Read: రానా తానే ప్రధాన పాత్రలో నటిస్తూ నిర్మించాలని నిర్మించాలని భావించిన హిరణ్యకశ్యప ప్రాజెక్ట్ కూడా ఆగిపోయినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రానా లుక్‌తో పాటు లాంగ్ గ్యాప్‌తో రానా మార్కెట్‌ కూడా ఆశించిన స్థాయిలో లేకపోవటంతో రానా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ప్రకటించిన సినిమాల విషయంలో కూడా రానా పునరాలోచనలో ఉన్నాడన్న టాక్‌ మీడియా సర్కిల్స్‌లో బలంగా వినిపిస్తోంది. Also Read: అయితే ఈ పుకార్లన్నింటికీ ఒక్క ట్వీట్‌తో సమాధానం చెప్పాడు రానా. తన ఆరోగ్య పరిస్థితితో పాటు, సినిమాల విషయంలో వస్తున్న వార్తలకు చెక్‌ పెట్టాడు. `అది నా గురించి అయ్యుండి. నేను చెప్పకపోతే.. అది అబద్ధమే` అంటూ ట్వీట్ చేశాడు రానా. రానా ట్వీట్‌పై స్పందించిన అభిమానులు మ్యాటరేంటి అని అడగితే `సోది మ్యాటర్‌ ఎక్కువైంది` అంటూ రిప్లై ఇచ్చాడు. ఇటీవల విదేశాల నుంచి తిరిగి వచ్చిన రానా, లండన్‌లో జరిగిన బాహుబలి ప్రదర్శనకు రాజమౌళి, ప్రభాస్‌లతో కలిసి హాజరయ్యాడు. ప్రస్తుతం షూటింగ్‌లకు సిద్ధమవుతున్న ఈ యంగ్ హీరో హాథీ మేరీ సాథీ, సినిమాల్లో నటించనున్నాడు. రానా నటించిన బాలీవుడ్‌ మూవీ హౌస్‌ఫుల్‌ 4 దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అక్షయ్‌ కుమార్‌, రితేష్ దేశ్‌ముఖ్‌, బాబీ డియోల్, కృతి సనన్‌, పూజా హెగ్డే, క్రితి కర్బందాలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/32Dz12p

No comments:

Post a Comment

'A Lot Of The Impact For Kajra Re Must Go To Ash'

'The sincerity and commitment to art is something you don't see much these days; it's more about the moolah.' from rediff ...