Thursday, 24 October 2019

నీతులు చెప్పడమే కాదు.. పాటిస్తున్న దర్శకుడు

రచయితగా ఎన్నో బ్లాక్‌ బస్టర్‌ చిత్రాలకు పనిచేసిన కొరటాల శివ, మిర్చి సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్‌ హీరోగా యూవీ క్రియేషన్స్‌ సంస్థ నిర్మించిన ఈ సినిమా సూపర్‌ హిట్ అవ్వటమే కాదు దర్శకుడిగా స్థానాన్ని పదిలం చేసింది. ఈ సినిమాతోనే ప్రభాస్‌ మార్కెట్‌ రేంజ్‌ కూడా భారీగా పెరిగింది. మాస్‌ యాక్షన్‌ ఎలిమెంట్స్‌తో సినిమాను తెరకెక్కించే కొరటాల శివ తన సినిమాలో ఓ సందేశం ఉండేలా జాగ్రత్త పడుతుంటాడు. తొలి సినిమా నుంచి ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నాడు కొరటాల శివ. మిర్చిలో `వీలైతే ప్రేమిద్దాం డ్యూడ్‌.. మహా అయితే ఏం చేస్తారు తిరిగి ప్రేమిస్తారు` అంటూ ఫ్యాక్షన్‌ గొడవలకు స్వస్తి పలకాలని చెప్పిన కొరటాల శివ తరువాత సినిమాతో వెనుకపడిన గ్రామాలను డబ్బున్న వారు దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలన్న సందేశాన్ని ఇచ్చాడు. శ్రీమంతుడు సినిమా రిలీజ్ తరువాత మహేష్ బాబు సహా ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు గ్రామాలను దత్తత తీసుకునేందుకు ముందుకు వచ్చారు. Also Read: కమర్షియల్‌ ఫార్ములా సినిమాలోనే సందేశాన్ని జొప్పించే కొరటాల శివ, ఎన్టీఆర్ లాంటి మాస్‌ హీరోతోనూ అదే ఫార్ములాను రిపీట్ చేశాడు. జనతా గ్యారేజ్‌ సినిమాలో పర్యావరణ పరిరక్షణ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. తరువాత రిలీజ్‌ అయిన అనే నేను సినిమాతో బాధ్యతగల ముఖ్యమంత్రి ఎలా ప్రవర్తించాలో చెపుతూనే సమాజంలో ఎలాంటి మార్పులు రావాలి అన్న అంశాలను చూపించాడు. అయితే తన ప్రతీ సినిమాలో ఇన్ని సందేశాలిస్తున్న కొరటాల శివ, వ్యక్తిగతంగానూ తాను కూడా వీలైనంత వరకు అవి పాటిస్తున్నాడు. తాజాగా తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్ట్ చేశాడు ఈ బ్లాక్‌ బస్టర్‌ దర్శకుడు. హైదరబాద్‌ నగరంలో వర్షాలతో తడిసి ముద్దవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వర్షపు నీటిని వడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. తన ఆఫీస్‌లో ఏర్పాటు చేసి ఇంకుడు గుంతల వీడియోను ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఈ డైరెక్టర్‌ `మా ఆఫీస్‌లో వాన నీటిని రక్షించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రతీ నీటి చుక్కను ఇంకుడు గుంతలో భద్రపరుస్తున్నాం` అంటూ ట్వీట్ చేశాడు. కొరటాల శివ చేసిన ఈ పోస్ట్‌తో అభిమానులు అభినందనలు తెలుపుతూ రిప్లై ఇస్తున్నారు. నీతులు చెప్పడమే కాదు పాటిస్తున్న డైరెక్టర్‌ అంటూ కొరటాల శివను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. భరత్‌ అనే నేను తరువాత లాంగ్ గ్యాప్‌ తీసుకున్న కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కించబోయే సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉన్నాడు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2WaLBUm

No comments:

Post a Comment

'It Has Been A Box Of Surprises'

'My journey has just been so different. Each character has been so different.' from rediff Top Interviews https://ift.tt/wluedtB