
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఎంట్రీ ఇచ్చిన ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ సినిమాతో హీరోగానూ సక్సెస్ సాధించాడు. తరువాత బాలీవుడ్‌లో చిచోరే సినిమాతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ యంగ్ హీరో తాజాగా మరో ఇంట్రస్టింగ్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు. లేటెస్ట్ కామెడీ సెన్సేషన్స్ స్టార్స్ ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో కలిసి జాతి రత్నాలుగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. Also Read: మహానటి లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తరువాత స్వప్న సినిమా బ్యానర్‌లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. జాతీయ అవార్డు సాధించిన దర్శకుడు నాగ అశ్విన్ ఈ సినిమాతో నిర్మాతగా మారుతున్నాడు. ఈ సినిమాకు అనుధీప్ కేవీ దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. Also Read: ఈ ఫస్ట్ లుక్‌లో ముగ్గురు నటులు ఖైధీల డ్రస్‌లలో కనిపించారు. వాళ్ల ఖైదీ నంబర్లు కూడా నవీన్ 420, ప్రియదర్శి 210, రాహుల్ రామకృష్ణ 840గా చూపించారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయతో సూపర్‌హిట్ అందుకున్న నవీన్, బ్రోచేవారెవరురాతో ఆకట్టుకున్న ప్రియదర్శి, రాహుల రామకృష్ణల కాంబినేషన్‌పై మంచి హైప్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే 70 శాతానికి పైగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు రథన్ సంగీతమందిస్తున్నాడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/361lLXC
No comments:
Post a Comment