
సీనియర్ సంగీత దర్శకుడు ఎం ఎం చిన్న కొడుకు శ్రీ సింహా హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఇప్పటికే కీరవాణి పెద్ద కొడుకు కాళభైరవ గాయకుడిగా సంగీత దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నాడు. తాజాగా కీరవాణి చిన్న కుమారుడు కూడా సినీరంగంలో తన మార్క్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. గతంలోనూ శ్రీ సింహా వెండితెర మీద అలరించాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన యమదొంగ సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి పాత్రలో నటించిన బాలనటుడు శ్రీ సింహనే. తరువాత మర్యాదరామన్న, బాహుబలి ది బిగినింగ్ చిత్రాల్లోనూ నటించాడు ఈ యువ నటుడు. తరువాత నటనకు బ్రేక్ ఇచ్చి కొంతకాలం దర్శకత్వం శాఖలో పనిచేశాడు. Also Read: రామ్ చరణ్ హీరోగా సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కిన రంగస్థలం సినిమాకు శ్రీ సినిమా అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేశాడు. ఇప్పుడు హీరోగా ఎంట్రీ ఇస్తు్న్నాడు. కొత్త దర్శకుడు రితేష్ రానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో శ్రీ సింహ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మత్తు వదలరా అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. 1966లో రిలీజ్ ఎన్టీఆర్ సూపర్ హిట్ క్లాసిక్ శ్రీ కృష్ణపాండవీయం సినిమాలోని సూపర్ హిట్ పాట లిరిక్‌ను ఈ సినిమాకు టైటిల్‌గా ఫిక్స్ చేశారు. సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా ఇంట్రస్టింగ్‌గా డిజైన్ చేశారు. న్యూసెన్స్ పేరుతో ఉన్న వార్త పత్రికలో శ్రీ సింహను హీరోగా పరిచయం చేస్తున్నట్టుగా వార్తతో పాటు ఆశ్యర్యం వక్తం చేస్తున్న ఎన్టీఆర్ స్టిల్, బ్లడ్ షేడ్స్‌తో పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. చిరంజీవి (చెర్రీ), హేమలతలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు కీరవాణి పెద్ద కుమారుడు కాళ భైరవ సంగీతమందిస్తున్నాడు. Also Read:
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/33XWfAK
No comments:
Post a Comment