Monday 7 March 2022

మనల్ని ఎవడ్రా ఆపేదిక్కడ.. పవన్ కళ్యాణ్ ఆన్ ఫైర్! వీడియో వైరల్

పవర్ స్టార్ హీరోగా వచ్చిన థియేటర్స్‌లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటికే 150 కోట్ల క్లబ్‌లో చేరిపోయి కల్లెక్షన్స్ పరంగా భేష్ అనిపించుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా ‘భీమ్లా బ్యాక్‌ ఆన్‌ డ్యూటీ’ అంటూ సంగీత దర్శకుడు తమన్‌ ఓ ర్యాప్‌ సాంగ్‌ రిలీజ్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ''వచ్చాడు భీమ్లా.. గ్రానైట్‌ బాంబులా.. కల్లోలం చేస్తాడు చూసుకో సాలా.. లాఠీతో చాలా.. ఉంటాది దూల...షురూ చేసిండంటే.. కాళ్లు మొక్కాలా'' అంటూ సాగే ఈ పాటను ఆసక్తికరంగా మలిచారు. 'మనల్ని ఎవడ్రా ఆపేదిక్కడ' అంటూ పవన్ కళ్యాణ్ గర్జిస్తున్న డైలాగ్ హైలైట్ అవుతోంది. ఈ వీడియోలో కీలక సన్నివేశాలతోపాటు చిత్రీకరణ సమయంలో చోటుచేసుకున్న సరదా సంఘటనలను జత చేశారు. దీంతో విడుదలైన కాసేపట్లోనే ఈ వీడియో వైరల్‌గా మారింది. సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ భీమ్లా నాయక్ చిత్రాన్ని నిర్మించారు. సాగ‌ర్ కె.చంద్ర దర్శకత్వం వహించగా త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ మాట‌లు, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు దర్శకత్వ పర్యవేక్షణ చేశారు. పవన్ కళ్యాణ్, రానా ద‌గ్గుబాటి హీరోలుగా.. నిత్యామీన‌న్‌, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా న‌టించారు. వెండితెరపై పవన్ కళ్యాణ్ నటన, వేరియేషన్స్ ఆయన అభిమానులకు పూనకాలు తెప్పించాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాల్లో కలిపి రూ. 106.75 కోట్లు బిజినెస్‌ జరిగింది. దీంతో 108 కోట్ల రూపాయల టార్గెట్ పెట్టుకొని బరిలోకి దిగిన భీమ్లా నాయక్ ఆ దిశగా అడుగులేస్తున్నాడు. రీసెంట్‌గా ఈ మూవీ హిందీ ట్రైలర్ రిలీజ్ చేసి బీటౌన్ ఆడియన్స్ దృష్టిని లాగేశారు మేకర్స్. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ హిందీ వర్షన్ రిలీజ్ కానుంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/LBZaMXC

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz