సినిమా టికెట్స్ రేట్స్‌కు సంబంధించిన జీవోను విడుదల చేయకుండా ఏపీ ప్రభుత్వం కావాలనే అడ్డు పడిందంటూ పవన్ కళ్యాణ్ భీమ్లానాయక్ విడుదల సమయంలో రాజకీయ పరమైన విమర్శలు, పత్రి విమర్శలు చేసుకున్నారు. చివరకు భీమ్లా నాయక్ సినిమా విడుదలైంది. మంచి విజయాన్ని సాధించింది. దీనిపై సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తన యూట్యూబ్ ఛానెల్‌లో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వ తీరుని తప్పు పట్టారు. ‘‘పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ సినిమా తెగ హడావుడి చేసింది. ఈ మధ్య కాలంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సినిమా టికెట్ రేట్స్ తగ్గించి హడావుడి చేసింది. సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ విషయంలో ఏపీ గవర్నమెంట్‌కి, ముఖ్యంగా వై.ఎస్.జగన్‌గారికి థాంక్స్ చెప్పాలి. లేని దానికి హడావుడి చేసి మా సినిమాలన్నింటినీ హిట్ చేస్తున్నారు. జగన్‌గారికి తెలుసో, తెలియదో.. అవగాహన ఉందో లేదో తెలియదు. సినిమా టికెట్స్ కోసం చిరంజీవి, ప్రభాస్, మహేష్ వంటి వారిని తన వద్దకు పిలిపించుకోవడం తప్పు. పిలిపించుకున్న తర్వాత చేయకపోవడం తప్పు. ‘భీమ్లా నాయక్’ రిలీజ్ రోజు ఎం.ఆర్.ఓ వాళ్లని, వీళ్లని పెట్టి థియేటర్స్ దగ్గర హడావుడి చేయడం తప్పు. ఇప్పుడు కలెక్షన్స్ చూస్తున్నారు. ఏదైతే చేయాలనుకున్నారో అది ఫెయిలైంది. సినిమాకు హైప్ వచ్చింది. ప్రభుత్వాన్ని నడిపే తీరు ఇది కాదు. సినిమా టికెట్స్ అంశం అనేది చిన్నది. దాని కోసం జాతీయ స్థాయిలో గర్వకారణంగా నిలుస్తున్న యాక్టర్స్‌ను పిలిచి మాట్లాడించుకున్నారు. వాళ్లు మాట్లాడిన తర్వాత కూడా చేయకుండా అలా పడేశారు. పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ విడుదలవుతుంటే.. పొలిటికల్ సమస్య ఉందో లేదో నాకు తెలియదు కానీ.. హడావుడి ఎక్కువగా చేశారు. ఇవన్నీ చేయడం చూస్తుంటే అసహ్యంగా ఉంది. పోనీ బ్లాక్ టికెట్స్‌ను కంట్రోల్ చేశారా? ఏమొచ్చింది. పవన్ కళ్యాణ్‌గారినే కాదు.. ఏ ఆర్టిస్ట్‌ను ఎవరు ఏమీ చేయలేరు. సినిమాలంటే అభిమానంతో కూడుకుని ఉంటాయి. అభిమానాన్ని ఎవరు ఆపుదామన్నా ఆగదు. ‘భీమ్లా నాయక్’ సినిమాకు వైఎస్ఆర్‌సీపీ కార్యకర్తలు కూడా బ్లాక్ టికెట్స్ అమ్మారు. వైసీపీ కార్యకర్తలు కూడా కొనుక్కున్నారు. మీకు ఎక్కువ ఓట్లు, సీట్లు వచ్చి ఉండొచ్చు. రాజ్యమేలుతున్నారు. శుభ్రంగా ఏలండి. ఎవరు కాదనడం లేదు. సామాన్యులకు ఎంటైర్‌టైన్‌మెంట్‌ను అందుబాటులోకి తెచ్చేలా షూటింగ్స్‌కు పర్మిషన్స్‌ను ఫ్రీగా చేశారు. అది చాలా సంతోషించాల్సిన విషయం. దానికి ఇండస్ట్రీ వాళ్లు కూడా వచ్చి థాంక్స్ చెప్పి వెళ్లారు. అలాంటి పనులు చేయకుండా పగ సాధింపు పనులు చేయడం వల్ల అబాసు పాలవుతున్నారు. మమ్మల్ని అబాసు పాలు చేస్తున్నారు. ఇది పద్ధతి కాదు. ఇప్పటికైనా సినిమా టికెట్స్ ధరకు సంబంధించిన తగిన చర్యలు తీసుకోండి. ట్యాక్స్ రూపంలో వచ్చే ఆదాయాన్ని పోగొట్టుకోవద్దు. బ్లాక్ మార్కెట్‌ను ఎంకరేజ్ చేయకండి. మేమే కాదు.. ఎవరు చేసినా అది తప్పే. ఇప్పుడు సినీ ఇండస్ట్రీ నుంచి ప్రభుత్వానికి వంద కోట్ల లోపే ట్యాక్సుల రూపంలో ఆదాయం వస్తుంది. దాన్ని రెండు, మూడు వందల కోట్లు చేసుకోకుండా పాడు చేసుకుంటున్నారు. కాబట్టి తగు చర్యలు తీసుకుని ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలా చూసుకోండి’’ అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/WGIvjYq
No comments:
Post a Comment