యావత్ ప్రపంచానికి కరోనా గడగడలాడించింది. ఇప్పుడిప్పుడే పరిస్థితులన్నీ చక్కడుతున్నాయి. కరోనా కారణంగా చాలా పరిశ్రమలు దెబ్బతిన్నాయి. అలా ఇబ్బందులను ఎదుర్కొన్న వాటిలో సినిమా పరిశ్రమ కూడా ఉంది. అసలు సినిమా థియేటర్స్ మనుగడ ఉంటుందా? అని ఒకానొక దశలో అందరికీ అనుమానాలు వచ్చాయి. అయితే తెలుగు ఆడియెన్స్‌కు సినిమాపై ఉండే ప్రేమ, అభిమానం థియేటర్స్‌కు మళ్లీ జీవం పోశాయి. తెలుగు సినిమాను మన ప్రేక్షకులు ఆదరించిన తీరు చూసి యావత్ సినీ ప్రపంచం ఆశ్చర్యపోయింది. భారతదేశంలో బాలీవుడ్ జనాలు కూడా థియేటర్స్‌కు రావడానికి భయపడుతున్న తరుణంలో సినిమాపై తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ఆదరణ జయహో టాలీవుడ్ అని అందరూ ముక్త కంఠంతో అభినందించారు. ఇప్పుడు కోలీవుడ్ కూడా అదే విషయాన్ని గురువారం హైదరాబాద్‌లో జరిగిన తన ‘’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చెప్పారు. పాండమిక్ సమయంలో ఎంటైర్ ఇండియన్ సినీ ఇండస్ట్రీకి దారి చూపించి టాలీవుడ్ మాత్రమేనని ఆయన ఈ సందర్భంగా పేర్కొన్నారు. కరోనా భయాన్ని బ్రేక్ చేసింది తెలుగు ప్రేక్షకులేనని, అఖండ, పుష్ప, బంగార్రాజు, భీమ్లా నాయక్ వంటి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరించిన తీరుకి హ్యాట్పాఫ్ చెప్పాల్సిందేనని సూర్య తెలిపారు. నిజంగా ఇతర సినీ పరిశ్రమకు చెందిన ఓ స్టార్ హీరో మన తెలుగు సినిమా పరిశ్రమను ఇలా అభినందించడం మనం గర్వపడాల్సిన విషయమే. తమిళంతో పాటు తెలుగులోనూ సినిమాల పరంగా క్రేజ్, మార్కెట్ ఉన్న కోలీవుడ్ హీరోస్‌లో సూర్య ఒకరు. ఆయన సినిమాలు తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలవుతుటాయి. ఇప్పుడీ వెర్సటైల్‌యాక్టర్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఈటీ’. ఈ యాక్షన్ థ్రిల్లర్ మార్చి 10న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్ రిలీజ్ కానుంది. సన్ పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రానికి పాండి రాజ్ దర్శకుడు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/MRtZrAe
No comments:
Post a Comment