Wednesday, 2 March 2022

ఆర్జీవీకి అమ్మాయిల పిచ్చి! తొమ్మిదేళ్ల వయసులోనే.. నిజాలు బయటపెట్టిన వర్మ సిస్టర్

సినీ ఇండస్ట్రీలో వర్మ రూటే సపరేటు. ఏ విషయంపై అయినా అందరూ ఒకలా ఆలోచిస్తే దాన్ని మరో కోణంలో చూస్తుంటారు. లాజిక్స్ మాట్లాడటం, మనసులో ఏదీ దాచుకోకుండా కుండబద్దలు కొట్టేయడం నైజం. దర్శకుడిగా ఎప్పుడో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న ఆయన, ఇప్పుడు మాత్రం వివాదాస్పద సినిమాకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు. అంతేకాదు మనోడిపై అమ్మాయిల పిచ్చోడు అనే ముద్ర కూడా ఉందండోయ్. ఇదే విషయమై తాజాగా వర్మ సోదరి రియాక్ట్ అయింది. చిన్ననాటి సంగతులు వివరిస్తూ ఓపెన్ అయింది. రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ వస్తుందంటే అందులో ఎంతోకొంత స్టఫ్ దొరుకుంటుందని నెటిజన్లు తెగ వెతుకుతుంటారు. ఇక ఆయన్ను లేడీ యాంకర్ ఇంటర్వ్యూ చేస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. మరోవైపు ఈ మధ్యకాలంలో తన హీరోయిన్లతో పబ్లిక్ డాన్సులు చేస్తూ, పబ్బులకు వెళుతూ వార్తల్లో నిలుస్తున్నారు ఆర్జీవీ. ఇదిలా ఉంటే బిగ్ బాస్ బ్యూటీలు అరియానా, అషు రెడ్డిలతో ఆర్జీవీ బోల్డ్ ఇంటర్వ్యూల సంగతి మీ అందరికీ తెలుసు. వీటన్నింటిని లెక్కలోకి తీసుకొనే వర్మను అమ్మాయిల పిచ్చోడని కొందరంటుంటారు. అయితే ఆయనకు నిజంగానే అమ్మాయిల పిచ్చి ఉందా? వర్మ అమ్మాయిలను ఏ దృష్టిలో చూస్తారు? బాల్యంలో ఎలా ఉండేవాడు అనే దానిపై ఆయన సోదరి విజయలక్ష్మి మాట్లాడింది. ఇటీవల ఓ యూట్యూబ్‌ చానల్‌తో మాట్లాడిన విజయ లక్ష్మి.. రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ఆసక్తికర విషయాలు చెప్పింది. తనదైన మాటలు, వ్యక్తిత్వంతో అందరిని ఆశ్చర్యపరిచే వర్మ.. 9 ఏళ్ల వయసులో కుటుంబానికి షాకిచ్చాడని ఆమె చెప్పింది. చిన్నప్పటి నుంచే వర్మలో భిన్నమైన ఆలోచనలు ఉండేవని, అసలు ఎవరికీ అర్థమయ్యేవాడు కాదని ఆమె తెలిపింది. తొమ్మిదేళ్ల వయస్సులోనే తన మేధస్సుతో ఇంట్లో వాళ్లను ఆశ్చర్యపరిచాడని చెప్పింది. ఓసారి మా మామయ్యతో నేను, అన్నయ్య (వర్మ) సినిమాకు వెళ్లాం. తిరిగి వచ్చాక మామయ్యను తన సందేహం తీర్చమని అడిగాడు అన్నయ్య. ఆ మూవీలో టైం బాంబ్ పెట్టి ట్రైన్‌ను బ్లాస్ట్ చేసే సీన్‌పై ఆయన తీసిన లాజిక్ అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు మన దేశంలో ట్రైన్ ఎప్పుడైనా సరైన టైంకి వస్తుందా? అలాంటప్పుడు ఆ మూవీ డైరెక్టర్ టైం బాంబును సెట్ చేయడం ఏంటీ? అని ప్రశ్నించాడు వర్మ. నిజమే కదా అని అందరం ముక్కున వేలేసుకున్నాం. అప్పటినుంచే వర్మవి డిఫరెంట్ ఆలోచనలు అని విజయ లక్ష్మి చెప్పుకొచ్చింది. ఇక అమ్మాయిల విషయంలోనూ వర్మ తీరు చాలా డిఫరెంట్ అని ఆమె చెప్పింది. అందరూ అనుకున్నట్లుగా వర్మకు అమ్మాయిల పిచ్చిలేదని తెలిపింది. చిన్నప్పుడు మా ఇంటికి నా స్నేహితురాలు అనురాధ వచ్చినప్పుడు ఆమెను చూసిన వెంటనే నీ కళ్లు చాలా బావున్నాయి అని చెప్పాడు వర్మ. ఆ మాటతో మేమంతా షాకయ్యాం. కానీ ఆ తర్వాత చాలాసార్లు నా స్నేహితురాలు మీ అన్న నన్ను పొగిడాడు అని తెగ మురిసిపోయిందని విజయలక్ష్మి చెప్పుకొచ్చింది. అయితే దానికి మెల్లకన్ను కదా నీకెలా నచ్చింది అని అన్నయ్యను అడిగా.. దానికి అన్నయ్య ‘అస్సలు నేను ఆ అమ్మాయిని కూడా చూడలేదు.. ఏదో ఒక మాట అలా అనేశాను’ అని చెప్పాడు. అలా అమ్మాయిలను సంతోష పెట్టడానికే అన్నయ్య అలా మాట్లాడతారు తప్ప ఎప్పుడూ మిస్ బిహేవ్ చేసింది లేదని వర్మ సోదరి చెప్పడం విశేషం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/Ow85zn3

No comments:

Post a Comment

'Why Oppose Singing Gandhiji's Bhajan?'

'The BJP should identify those involved in the protest against singing Gandhiji's bhajan and take action against them.' from r...