Tuesday, 1 March 2022

భీమ్లా నాయక్ సునామీ.. 5వ రోజు అంచనాలను మించి వసూళ్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబోలో వచ్చిన మూవీ థియేటర్లలో సత్తా చాటుతోంది. పవన్ కళ్యాణ్ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇస్తూ భారీ రేంజ్ కలెక్షన్స్ రాబడుతోంది. తొలి మూడు రోజులతో పోల్చితే నాలుగో రోజు కాస్త డీలా పడ్డ భీమ్లా నాయక్.. 5వ రోజుకు వచ్చే సరికి తిరిగి పుంజుకున్నాడు. అన్ని ఏరియాల్లో కూడా డీసెంట్ కలెక్షన్స్ వచ్చినట్లు లేటెస్ట్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో భీమ్లా నాయక్ రోజువారి వసూళ్లు డే 1: 26.42 కోట్లు డే 2: 13.14 కోట్లు డే 3: 13.51 కోట్లు డే 4: 5.18 కోట్లు డే 5: 7.25 కోట్లు మొత్తంగా ఈ 5 రోజుల్లో కలిపి 65.50 కోట్ల రూపాయల షేర్ రాగా.. 91.30 కోట్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 7.30 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. ఓవర్‌సీస్ లో చూస్తే 11 కోట్లు, మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా చూస్తే 84 కోట్ల రూపాయల షేర్, 135 కోట్ల గ్రాస్ వసూలైంది. భారీ బడ్జెట్‌ కేటాయించి రూపొందించిన ఈ 'భీమ్లా నాయక్' మూవీకి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 88.75 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అదే ప్రపంచ వ్యాప్తంగా చూస్తే 106.75 కోట్లు మేర బిజినెస్‌ జరిగింది. దీంతో 108 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ సినిమాకు ఇప్పటిదాకా 84 కోట్ల రూపాయల షేర్‌ వచ్చినట్లు రిపోర్ట్స్ చెబుతున్నాయి. సో.. బ్రేక్ ఈవెన్ కావాలంటే మరో 24 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది. రానున్న మరో మూడు రోజులు ఈ సినిమాకు మరింత కీలకం కానున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2kyXNzi

No comments:

Post a Comment

'Never Be Another Zakir Hussain'

'Zakir <em>bhai</em> always said, '<em>koi chala nahi jata hai</em>', he believed even after death, you ...