Saturday, 3 July 2021

Maa Elections: ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం.. బాంబ్ పేల్చిన మురళీ మోహన్.. చిరంజీవితో కీలక చర్చలపై ఓపెన్

సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) ఎన్నికలపై షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ ‘మా’ అధ్యక్షుడు, సీనియర్ నటుడు . ప్రముఖ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘మేం చేసినప్పుడు పరిస్థితి ఇప్పటిలా లేదు.. అప్పుడు చాలా పద్దతిగా ఉండేది. అప్పట్లో మా మెంబర్స్ కూడా చాలా తక్కువగా ఉండేవారు. ఇప్పుడు వరదలు వచ్చినప్పుడు గేట్లు ఎత్తినట్టుగా ఎవరికి పడితే వాళ్లకి మా సభ్యత్వం ఇస్తున్నారు. అసలు ఎవరు మా మెంబరో కాదో తెలియకుండా పోయింది. ఇప్పుడు దాదాపు 1000 మంది ఉన్నారు. 500 అంటేనే ఎక్కువ. మేం బ్రహ్మాండంగా చేశాం.. ఇప్పుడున్న వాళ్లు కూడా చేస్తున్నారు కానీ.. పాత రోజులు మళ్లీ వస్తే బావుంటుంది. కొన్ని విధానలు మారాలి.. అందుకే ఈ మధ్యన నేను, చిరంజీవిగారు.. జయసుధ గారు.. మోహన్ బాబు గారు.. క్రిష్ణంరాజు గారు.. చాలా సిట్టింగ్‌లు జరిపి గాడిన పెట్టే ప్రయత్నం చేస్తున్నా. ఓ దారికి తీసుకుని వస్తాం. మా ఆలోచన ఏంటి అంటే.. ఈసారి ఎలక్షన్స్ కాకుండా.. ఏకగ్రీవంగా మా అధ్యక్షుడ్ని ఎంపిక చేసి.. మంచి కమిటీని ఏర్పాటు చేయాలని చూస్తున్నాం. గాడి తప్పిన ‘మా’ సరైన ట్రాక్‌లో పెట్టాలని చూస్తున్నాం. ఇప్పుడు మళ్లీ పోటీ.. ఎన్నికలు అంటే అల్లరైపోయి గొడవలు వస్తాయి. చాలామంది మేం పోటీ చేస్తాం అంటే మేం పోటీ చేస్తాం అని అంటున్నారు. మాకు సాధ్యమైనంత వరకూ అందర్నీ ఒప్పించి ఎన్నికలు ఏకగ్రీవం అయ్యేలా చేస్తాం. ఈ నిర్ణయాన్ని అందరూ ఒప్పుకుని తీరాలి.. ఎందుకంటే.. ఇంకా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుని కుక్కలు చింపిన విస్తరిలా ‘మా’ని మార్చకూడదు. ఇది ఇలాగే కంటిన్యూ అయితే ‘మా’కి కింకా చెడ్డ పేరు వస్తుంది. మా ప్రెసిడెంట్ పదవి అంటే ఎందుకు ఇంత ప్రాధాన్యత అంటే.. దాని వల్ల వచ్చేది ఏం ఉండదు.. అది ఒక హోదా మాత్రమే’ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yof4w7

No comments:

Post a Comment

Will Hathiram Be Killed In Paatal Lok?

'I insisted only Jaideep could play Inspector Haathiram Chaudhary.' from rediff Top Interviews https://ift.tt/RHLTIwD