Wednesday, 22 July 2020

Rgv: పవన్ కళ్యాణ్ వీరాభిమాని ఆర్జీవీ.. అలా చేయమని 50వేలు ఇచ్చారు.. ఓపెన్ అయిన షకలక శంకర్

వివాదాస్పద దర్శకుడు ఏ క్షణాన్నైతే పవర్ స్టార్ సినిమా అనౌన్స్ చేశారో అప్పటినుంచి సినీ, రాజకీయ వర్గాల్లో ఓ రేంజ్ చర్చలు నడుస్తున్నాయి. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్పద మూవీ తీస్తూ వస్తున్న వర్మ.. ఈ సారి ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేయడం ఇటు సినీ ప్రేక్షకులు, అటు జనసైనికులు జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో పవన్ ఫ్యాన్స్ అంతా ఒక్కటై లీడ్ రోల్‌లో 'పరాన్నజీవి' మూవీ ప్రకటించారు. దీంతో పవర్ స్టార్ Vs పరాన్నజీవిగా మారిపోయింది సిచువేషన్. బిగ్ బాస్ సీజన్ 2 కంటెస్టెంట్, పవన్ కళ్యాణ్ భక్తుడు నూతన్ నాయుడు ఈ ‘పరాన్న జీవి’ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. రామ్ గోపాల్ వర్మ పాత్రలో షకలక శంకర్ నటిస్తున్నాడు. ఏ రోజైతే వర్మ ‘పవర్ స్టార్’ సినిమా రిలీజ్ చేస్తానన్నారో అదే రోజు జూలై 25న ‘పరాన్నజీవి’ సినిమాను ఆన్ లైన్‌లో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు పవన్ ఫ్యాన్స్. దీంతో ప్రెజెంట్ సినీ, రాజకీయ వర్గాల చర్చలన్నీ ఈ రెండు సినిమాపైనే నడుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా ఓ లైవ్ టీవీలో ఆర్జీవీ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు షకలక శంకర్. ఆర్జీవీ గురించి మాట్లాడుతూ ఓపెన్ అయిన షకలక శంకర్.. తాను పవన్ కళ్యాణ్ వీరాభిమానిని అని అంటూనే, ఆర్జీవి గారి వల్లే ఈ స్థాయిలో ఉన్నానని అన్నాడు. ఓ విధంగా చెప్పాలంటే ఆర్జీవిగారు పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అని, నిజానికి పవన్ కళ్యాణ్ అంటే ఆర్జీవికి కూడా చాలా ఇష్టమని ఆయన చెప్పడం విశేషం. ఈ లాక్ డౌన్‌లో కూడా ఆర్జీవి గారు చాలా మందికి పని కల్పిస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నారని అన్నాడు. అంతేకాదు ఆర్జీవీ గారికి తనంటే కూడా బాగా ఇష్టమని చెప్పాడు షకలక శంకర్. Also Read: ఓ సందర్భంలో తనను స్పెషల్‌గా పిలిపించుకున్న ఆర్జీవీ.. ఆయన్ను ఇమిటేట్ చేయమని 50వేలు కూడా ఇచ్చారని షకలక శంకర్ చెప్పాడు. కాకపోతే గతంలో లాగా ఆర్జీవీ నుంచి మంచి సినిమాలు రాకపోవడం బాధగా ఉందని ఆయన అన్నాడు. సత్య, శివ, సర్కార్, రంగీలా వంటి ఎన్నో మంచి మంచి సినిమాలు తీసిన ఆర్జీవి ప్రస్తుతం అలాంటి సినిమాలు చేయకపోవడం బాధాకరమైన విషయం అంటూ పరోక్షంగా వర్మ ఓ సెటైర్ వేశాడు. ఆర్జీవీ, పవన్ కళ్యాణ్‌లపై శంకర్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం జనాల్లో హాట్ టాపిక్ అయ్యాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30wP2ao

No comments:

Post a Comment

'Rahul Would Have Been Wiser Had He...'

'...spent 1/10th of his time at 24, Akbar Road...' from rediff Top Interviews https://ift.tt/8rCaHZV