Thursday, 23 July 2020

Rana Wedding: వైరల్ అవుతున్న రానా దగ్గుబాటి పెళ్లి పత్రిక.. వేదిక, ముహుర్తం వివరాలివే!

అందరూ లాక్‌డౌన్ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న సమయంలో 'ఆమె ఎస్ అనేసింది' అంటూ తన ప్రేయసిని పరిచయం చేస్తూ సడెన్ సర్‌ప్రైజ్ చేశారు దగ్గుబాటి రానా. ఏకంగా తన లవర్ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విషయాన్ని బయటపెట్టేశారు. ఆ వెంటనే రంగంలోకి దిగిన రానా తండ్రి, నిర్మాత సురేష్ బాబు.. ఇది ప్రేమ వరకేనా లేక పెళ్లి కూడా చేసుకుంటారా? అనే దానిపై ఏ మాత్రం ఆలస్యం చేయకుండా క్లారిటీ ఇచ్చేశారు. మిహికాతో ఆగస్టు 8వ తేదీన రానా పెళ్లి ఉంటుందని చెప్పేశారు. ఆ తర్వాత మే 21వ తేదీన రానా, మిహిక కుటుంబాలు రాకా ఫంక్షన్ ద్వారా ఒక్కటై వారి పెళ్లి జరగనుందని అధికారికంగా తెలిపారు. ఇక తాజాగా ఇరు కుటుంబాలు అనుకున్న ఆ తేదీ ఆగస్టు 8నే పెళ్లి వేడుక జరగనుందని కన్ఫర్మ్ చేస్తూ అఫీషియల్‌ పెళ్లి పత్రికను అందరి ముందుంచారు. ఈ వివాహ పత్రికను వీడియో రూపంలో ఎంతో అద్భుతంగా డిజైన్ చేయడం విశేషం. పౌరాణికం థీమ్‌ తీసుకొని పాత చిత్రం మాయాబజార్'లోని సన్నివేశాన్ని జత చేస్తూ రానా, మిహికాల ఫొటోలతో ఆసక్తికరంగా రూపొందించారు. దీంతో రానా వివాహ పత్రిక క్షణాల్లోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు, చైతన్య ఎన్‌క్లేవ్, ఖాజాగూడ, మణికొండ, హైదరాబాద్‌లో రానా- మిహికా వివాహం జరుగుతుందని ఈ పత్రిక ద్వారా వెల్లడించారు. అయితే కరోనా విలయతాండం చేస్తున్న కారణంగా ప్రభుత్వ నిబంధనలను అనుసరించి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలోనే రానా వివాహ వేడుక జరగనుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ పెళ్ళికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ పెళ్లి పత్రిక చూసిన రానా ఫ్యాన్స్.. బ్యూటిఫుల్ జోడీకి పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Bpn5ZG

No comments:

Post a Comment

'Rahul Would Have Been Wiser Had He...'

'...spent 1/10th of his time at 24, Akbar Road...' from rediff Top Interviews https://ift.tt/8rCaHZV