Thursday, 23 July 2020

Ram Gopal Varma: ‘నిక్కర్‌లో నిఖిల్’.. వర్మ సినిమా తీసి ట్రైలర్ రిలీజ్ చేస్తాడట, ఓ రేంజ్‌లో ఏకేస్తున్న ఫ్యాన్స్

అందర్నీ కెలికి కెలికి వివాదాలు రాజేసే వర్మను యంగ్ హీరో అనవసరంగా కెలికాడా?? పవన్ ఫ్యాన్స్‌లో మైలేజ్ వస్తుందనో లేక.. నిజంగానే వీరాభిమానమో తెలియదు కాని వర్మ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ మధ్య హీట్ హీట్ వార్ నడుస్తున్న తరుణంలో హీరో నిఖిల్ చేసిన ట్వీట్‌పై హాట్ టాపిక్ నడుస్తోంది. పవన్ కళ్యాణ్‌ని టార్గెట్ చేస్తూ వర్మ రూపొందించిన ‘పవర్ స్టార్’ మూవీ ట్రైలర్‌ను బుధవారం నాడు విడుదల చేశారు వర్మ. ఇందులో పవన్ కళ్యాణ్‌ను ప్రవన్ కళ్యాణ్‌గా చూపించిన వర్మ.. ఆయన రాజకీయ జీవితాన్నే కాకుండా వ్యక్తిగత విషయాలను సైతం చర్చిస్తూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌లో ఆగ్రహం తెప్పించారు. నిజానికి పవన్ ఫ్యాన్స్‌ని రెచ్చగొట్టి తద్వారా మైలైజ్ పొందాలనే వర్మ.. ఈ స్ట్రాటజీ ఉపయోగిస్తున్నప్పటికీ మరీ ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్‌ను చూపించడం ఆయన అభిమానులకు మింగుడపడటం లేదు. ఎవరో కుట్ర చేసి వర్మని రెచ్చగొట్టి ఈ సినిమా తీయిస్తున్నారు.. మీరు రెచ్చిపోయి అనవసరంగా ఆ సినిమాను హైలైట్ చేయొద్దని జనసేన పార్టీ నుంచే అధికారిక ఆదేశాలు వచ్చినప్పటికీ జనసైనికులు మాత్రం వర్మకు కరెక్ట్ కౌంటర్ ఇవ్వడం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో బిగ్ బాస్ నూతన నాయుడు ‘పరాన్న జీవి’ అంటూ వర్మకు కౌంటర్ ఇస్తూ షకలక శంకర్‌తో పవర్ స్టార్‌కి పోటీగా ‘పరాన్నజీవి’ని రంగంలోకి దింపారు. ఇక పవర్ స్టార్ సినిమా విడుదల తేదీ జూలై 25నే ఈ సినిమాని కూడా విడుదల చేస్తున్నప్రకటించారు పవన్ అభిమానులు. అంతే కాకుండా పరాన్న జీవి పోస్టర్స్‌తో వర్మకు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. పవర్ స్టార్ వర్సెస్ పరాన్న జీవిగా ఇండస్ట్రీలో ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఇదే సందర్భంలో హీరో నిఖిల్.. వర్మపై సంచలన ట్వీట్ చేశారు. ఇందులో వర్మ పేరు ప్రస్తావించకపోయినప్పటికీ అర్థమౌతుంది కదా అని ఆయనే హింట్ ఇచ్చారు. ''శిఖరాన్ని చూసి కుక్క ఎంత మొరిగినా. ఆ మహా శిఖరం తల తిప్పి చూడదు. మీకు అర్థం అయిందిగా' అంటూ ట్వీట్ పెట్టారు. దీనికి 'పవర్ స్టార్', 'పవన్ కల్యాణ్' అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించడంతో నిఖిల్ అన్నది వర్మనే అని పవన్ ఫ్యాన్స్ ఫిక్స్ అయ్యి.. ఈ ట్వీట్‌ని వైరల్ చేశారు. అయితే నిఖిల్ ట్వీట్‌ను చాలా లైట్ తీసుకున్న వర్మ.. నిఖిలా అతనెవరు.. అలాంటి వాళ్లు ఉన్నారనే సంగతి కూడా నాకు తెలియదు అంటూ తనదైన శైలిలో రియాక్ట్ అయ్యారు. ‘‘నిఖిల్ కావచ్చు, కిఖిల్ కావచ్చు.. వాళ్లంతా ఒకే కోవకు చెందినవాళ్లు. వీళ్లంతా పవన్ కళ్యాణ్ కింద తొత్తులు. ఇలా తొత్తుల్లా ఉంటే పవన్ కళ్యాణ్‌కు వీళ్లమీద మంచి అభిప్రాయం వస్తుందని వీళ్ల ఆశ. బానిసత్వం అనే బుద్ధిలో నుంచి వచ్చే ఆలోచన ఇది. నిఖిల్ ఎవడో నాకు తెలీదు. ఒక పెద్ద స్టార్ అయ్యుండొచ్చు.. కానీ నాకు తెలీదు’’ అని వర్మ తేల్చిపారేశారు. మొత్తానికి నిఖిల్.. ఆర్జీవీపై చేసిన ట్వీట్ వైరల్ అవుతుండగా.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిఖిల్‌ ఆశించినట్టుగానే మద్దతు ప్రకటిస్తే.. వర్మ ఫ్యాన్స్ కూడా తానేమీ తక్కువ కాదంటూ వర్మకు జై కొడుతున్నారు. ‘ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నావ్.. వర్మతో పెట్టుకోవడం నీకు అవసరమా నిఖిల్.. బ్రదర్ నువ్ అంటే అభిమానం నాకు, ఒక ప్రశ్నకి సమాధానం చెప్పు.. ఇదే వర్మ పెద్ద ఎన్టీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు సినిమాలో చూపిస్తే మాట్లాడలేదు.. కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాలో బాలయ్య బాబు బిడ్డని నెగటివ్‌గా చూపిస్తే మాట్లాడలేదు ఎందుకు? నీకు పవన్ ఫాన్స్ చాలా వేరే హీరో ఫాన్స్ అవసరం లేదా? ఇంతకీ ఇక్కడ కుక్క ఎవరూ?పావలనా లేక జీవినా? తెలుగోడు సత్తా ప్రపంచానికే చాటిన మన అన్న ఎన్టీఆర్ గారి మీద సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు మొరిగె కుక్కలు అప్పుడు మొరగలేదే? కలికాలం ఆంటే ఇదే మరి? నువ్వేమో ప్రచారం చేసింది టీడీపీ తరుపున ఇప్పుడేమో పవన్ కళ్యాణ్‌ని శిఖరం అంటున్నావ్.. అయినా వర్మతో నీకెందుకు ఆయన్ని కెలక్కు సామీ. నిక్కర్‌లో నిఖిల్ అని ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తాడు.. తరువాత నువ్ పిసుక్కోవడమే.. పిల్లోడివి పిల్లోడిలా ఉండవయ్యా నిఖిల్ అంటూ ఓ రేంజ్‌లో నిఖిల్‌పై కామెంట్స్ చేస్తున్నారు వర్మ అభిమానులు. అయితే వర్మ ఫ్యాన్స్‌కి గట్టి కౌంటర్స్ ఇస్తూ నిఖిల్‌కి మద్దతుగా నిలుస్తున్నారు పవన్ అభిమానులు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fSk3fH

No comments:

Post a Comment

'Rahul Would Have Been Wiser Had He...'

'...spent 1/10th of his time at 24, Akbar Road...' from rediff Top Interviews https://ift.tt/8rCaHZV