Thursday, 2 July 2020

Naga Babu: అది మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు: నిహారిక పెళ్లిపై నాగబాబు షాకింగ్ రియాక్షన్

ఓ వైపు కరోనా విలయతాండవం.. మరోవైపు టాలీవుడ్ ఇండస్ట్రీలో నటీనటుల పెళ్లి బాజాల సంగతులు నిత్యం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతూనే ఉన్నాయి. యంగ్ హీరో నిఖిల్ పెళ్లి చేసుకొని ఇంటివాడు కాగా, మరో హీరో నితిన్ పెళ్ళికి రెడీ అవుతున్నాడు. మరోవైపు రానా తన ప్రేయసితో రేలేషన్ కన్ఫర్మ్ చేశాడు. మెగా డాటర్ సైతం తనకు కాబోయే భర్తను ప్రేక్షక లోకానికి పరిచయం చేసేసింది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో గురించి ఆసక్తికరంగా స్పందించారు. ''సురేష్ బాబు గారు రానా పెళ్లి పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. మరి మీ అమ్మాయి నిహారిక పెళ్లి కూడా ఖాయమైంది. ఆ పెళ్లి సంగతులేంటి? ఎప్పుడు పెళ్లి పెట్టుకుంటున్నారు?'' అని యాంకర్ వేసిన ప్రశ్నకు బదులిచ్చిన నాగబాబు.. 'అది మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు' నిశ్చితార్థం అయ్యాక అన్నీ చెబుతా అన్నారు. Also Read: త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటామని నాగబాబు చెప్పారు. మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు కాబట్టి పర్సనల్ గానే ట్రీట్ చేస్తున్నానని ఆయన చెప్పడం గమనార్హం. అయితే కరోనా కారణంగా అట్టహాసంగా పెళ్లి చేయడం కుదరకపోవచ్చని, ప్రభుత్వ నిబంధనలు అనుసరిస్తూనే పెళ్లి చేయాల్సి వస్తుందని నాగబాబు చెప్పుకొచ్చారు. ఇప్పటి పరిస్థితులు చూస్తే.. ధూమ్ ధామ్ చేస్తూ పెళ్లిళ్లు చేసుకోలేమని స్పష్టంగా అర్థమవుతోందని నాగబాబు అన్నారు. అంతేకాదు నిహారిక పెళ్లిని కేవలం అతి దగ్గరి సన్నిహితుల మధ్య జరిపినా ఆశ్ఛర్యపోవాల్సిన అవసరం లేదని ఆయన చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2YPmqK3

No comments:

Post a Comment

'AI is playing critical role in LTIMindtree success'

'Our AI strategy -- AI in Everything, Everything for AI, and AI for Everyone -- is now in action.' from rediff Top Interviews http...