Thursday, 23 July 2020

రోజూ మార్నింగ్ మీ ఫేస్‌కి ఈ క్రీమ్, టోనర్ రాస్తే మెరిసిపోవడం ఖాయం..

ప్రతిరోజూ ఉదయాన్నే మీ స్కిన్ కోసం మీరు ప్రత్యేక కేర్ ను అందించాలి. దీన్నే అని అంటారు. ప్రతి రోజూ స్కిన్ అనేక విధాలుగా స్ట్రైన్ అవుతుంది. ఎండ, దుమ్ము, పొల్యూషన్, చెమట, విపరీతమైన వేడి లేదా చల్లదనం ఇలా చాలా ఫ్యాక్టర్స్ స్కిన్ ను ఒత్తిడికి గురిచేస్తాయి. దాంతో, స్కిన్ తన సహజకాంతిని కోల్పోయే ప్రమాదం ఉంది. స్కిన్ లో తిరిగి గ్లో తెప్పించడానికి ఇప్పుడు చెప్పుకోబోయే స్కిన్ కేర్ మార్నింగ్ రొటీన్ మీకు ఎంతగానో హెల్పవుతుంది. సింపుల్ డైలీ రొటీన్ తో స్కిన్ హెల్త్ ను కాపాడుకోవచ్చు. ప్రతి స్కిన్ టైప్ డిఫెరెంట్ గా ఉంటుంది. మీ స్కిన్ కు ఏది పనిచేస్తుందో తెలుసుకుంటే అందుకు తగిన స్కిన్ కేర్ రొటీన్ ను మీరు డైలీ లైఫ్ లో భాగం చేయగలుగుతారు. ఇలా చేస్తే మీ స్కిన్ తో మీకు ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. స్కిన్ ప్రాబ్లెమ్స్ ను వెనువెంటనే అర్థం చేసుకోగలుగుతారు. ఇపుడు చెప్పుకోబోయే టోనర్ అన్ని రకాల స్కిన్ టైప్స్ కు పెర్ఫెక్ట్ గా సూటవుతుంది. అలోవెరా+రోజ్ వాటర్ టోనర్.. డైలీ రోటీన్ లో ఈజీగా యాడ్ చేయగలిగే ఒక సింపుల్ మార్నింగ్ రొటీన్ గురించి ఇప్పుడు మీకు చెబుతున్నాం. దీనికి కేవలం రెండు పదార్థాలు ఉంటే సరిపోతుంది. అలోవెరా మరియు రోజ్ వాటర్ తో అద్భుతం చేయవచ్చు. ఇది టోనర్ లా పనిచేస్తుంది. ఫేస్ ను స్మూత్ గా, సాఫ్ట్ గా అలాగే టోన్డ్ గా చేస్తుంది. స్కిన్ ను హెల్తీగా చేసి గ్లో తీసుకువస్తుంది. సెన్సిటివ్ స్కిన్ కి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది. బ్రేకవుట్, యాక్నే అలాగే ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. ర్యాషెస్ తోపాటు దురదలు తగ్గిస్తుంది. ఉదయాన్నే కాస్తంత రోజ్ వాటర్ ను తీసుకోండి. అందులో, కొంత అలోవెరా జెల్ ను కలపండి. సింపుల్ టోనర్ రెడీ అవుతుంది. మొదట, అలోవెరా లీఫ్ ను తీసుకుని దాన్ని శుభ్రంగా వాష్ చేసి అందులోంచి జెల్ ను తీయండి. ఒకవేళ అలోవెరా ప్లాంట్ లేకపోతే మార్కెట్ లో లభ్యమయ్యే అలోవెరా జెల్స్ ను వాడినా మంచిదే. ఆ తరువాత, రోజాపువ్వు నుంచి కొన్ని రోజ్ పెటల్స్ ను తీసుకోండి. శుభ్రంగా కడగండి. జెల్ ను అలాగే ఈ రోజా పెటల్స్ ను బ్లెండర్ లో వేయండి. ఈ రెండూ లిక్విడ్ వంటి పేస్ట్ లా తయారవ్వాలి. మొత్తానికి టోనర్ పూర్తిగా సిద్ధమైంది. దీన్ని జార్ లో గాని లేదా శుభ్రమైన బాటిల్ లో గానీ భద్రపరచండి. దీన్ని ఫ్రిడ్జ్ లో భద్రపరిస్తే దాదాపు 5 నుండి 7 రోజుల వరకు నిలువ ఉంటుంది. ఒకవేళ టోనర్ షెల్ఫ్ లైఫ్ ను పెంచాలనుకుంటే కొంత విటమిన్ ఈ ఆయిల్ ను కూడా ఈ మిశ్రమానికి కలపాలి. విటమిన్ ఈ క్యాప్సూల్ ను కలిపితే ఇంకా మంచిది. అలాగే, మీకు నచ్చిన ఎసెన్షియల్ ఆయిల్ ను కూడా కలపొచ్చు. అలోవెరాను స్కిన్ కేర్ లో ఎందుకు వాడాలి? అలోవెరాలో కూలింగ్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అలాగే, ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ను కూడా మనం గమనించవచ్చు. అందుకే ఇది స్కిన్ కేర్ కు హెల్ప్ చేసే గ్రేట్ ఇంగ్రీడియెంట్ అని చెప్పుకోవచ్చు. ఈ జెల్ అనేది స్కిన్ పై ప్రొటెక్టివ్ లేయర్ లా ఫార్మవుతుంది. స్కిన్ లో మాయిశ్చర్ ను నిలిపి ఉంచేందుకు హెల్ప్ చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే మినరల్స్ స్కిన్ హీలింగ్ ప్రాసెస్ ను బూస్ట్ చేస్తాయి. రోజ్ వాటర్ ను ఎందుకు వాడాలి? ప్రతి ఇంట్లోనూ రోజ్ వాటర్ కు ప్రత్యేక స్థానం ఎందుకుందని ఆశ్చర్యపోతున్నారా? ఇందులో స్కిన్ బ్యూటీను పెంచే ప్రాపర్టీస్ ఎన్నో ఉన్నాయి. అన్ని రకాల స్కిన్ టైప్స్ కు కూడా రోజ్ వాటర్ సూటవుతుంది. కాబట్టి, ఆయిలీ, డ్రై, కాంబినేషన్ స్కిన్ కలిగిన వారు తమ బ్యూటీ రొటీన్ లో రోజ్ వాటర్ ను నిక్షేపంగా యాడ్ చేసుకోవచ్చు. స్కిన్ లోని పీహెచ్ బాలన్స్ ను మెయింటెయిన్ చేయడానికి రోజ్ వాటర్ హెల్ప్ చేస్తుంది. అలాగే అదనపు ఆయిల్ ప్రొడక్షన్ ను కంట్రోల్ చేస్తుంది. స్కిన్ కు తాజాదనం అందిస్తుంది. అప్లై చేసే విధానం: మొదటగా మీ ఫేస్ ను చల్లటి నీటితో శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు టోనర్ ను ఒక కాటన్ బాల్ లోకి తీసుకోండి. కాటన్ బాల్ సహాయంతో టోనర్ ను ముఖానికి అలాగే మెడకు సున్నితంగా అప్లై చేయండి. ఆ తరువాత మాయిశ్చరైజర్ ను అప్లై చేయడం మరచిపోకండి. లాభాలు: ఈ టోనర్ ను ప్రతిరోజూ అప్లై చేయడం వల్ల ఈ కింది మార్పులను మీరు గుర్తించగలరు: 1. ఈ టోనర్ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. సాగిపోయిన చర్మం అందంగా ఉండదు. ఈ టోనర్ తో స్కిన్ ను మళ్ళీ మంచి కండిషన్ లోకి తెచ్చుకోవచ్చు. 2. రోజంతా స్కిన్ పై సూతింగ్ అలాగే కామింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఫ్రెష్ ఫీలింగ్ కలుగుతుంది. స్కిన్ పై సూతింగ్ ఎఫెక్ట్ మనసును కూడా రిలాక్స్ చేస్తుంది. 3 సన్ బర్న్స్ త్వరగా తగ్గుతాయి. చిన్నపాటి స్కిన్ ఇంజురీస్ కూడా తగ్గుతాయి. 4. ఇంతకుముందు కంటే ఇప్పుడు యాక్నే బ్రేకవుట్స్ ప్రభావం తగ్గుతుంది. 5. రక్తప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది. దాంతో, స్కిన్ హెల్తీగా అలాగే యవ్వనంగా తయారవుతుంది 6. మొటిమలు, ర్యాషెస్ అలాగే మిగతా స్కిన్ ఇష్యూస్ తగ్గిపోతాయి. 7. స్కిన్ టోన్ ఈవెనవుతుంది. అనీవన్ స్కిన్ టోన్ హైపర్ పిగ్మెంటేషన్ వల్ల తలెత్తుతుంది. మెలనిన్ అనే పిగ్మెంట్ ఉత్పత్తి అధికంగా ఉండటం వల్ల డార్క్ పాచెస్ తో పాటు డార్క్ స్పాట్స్ స్కిన్ పై కనిపిస్తాయి. ఇవన్నీ ఏజ్డ్ స్కిన్ లుక్ కలిగిస్తాయి. కాబట్టి, ఈ హోమ్ మేడ్ స్పెషల్ టోనర్ ను మీ డైలీ మార్నింగ్ రొటీన్ లో ఇంక్లూడ్ చేస్తే మచ్చలేని చర్మసౌందర్యం మీ సొంతమవుతుంది. సో, అలోవెరా ప్లస్ రోజ్ వాటర్ తో స్కిన్ కేర్ ఎలా తీసుకోవాలో తెలుసుకున్నారుగా? మీరు కూడా పాటించి స్కిన్ బెనిఫిట్స్ పొందండి.


from Beauty Tips in Telugu: అందం చిట్కాలు, Homemade Natural Beauty Tips Telugu - Samayam Telugu https://ift.tt/3eVdHLb

No comments:

Post a Comment

'Everything Cannot Just Be Box Office'

'Failure teach you far more than your successes do you.' from rediff Top Interviews https://ift.tt/uoWzXqp