Thursday, 2 July 2020

మరో యాంకర్‌పై వర్మ కన్ను.. కెమెరా ముందే ఓపెన్.. ఝలక్ ఇచ్చిన యాంకర్

‘కాంప్లిమెంట్ ఇవ్వడానికి క్వాలిఫికేషన్ ఉండాలా?? అందం అంటే నాకు ఇష్టం.. అమ్మాయి అందాన్ని ఆస్వాదించడం నా నేచర్’ అంటూ ఈ మధ్య తనను ఇంటర్వ్యూలు చేయడానికి వచ్చిన అందమైన యాంకర్లను పొగడ్తలతో ముంచెత్తుతున్నాడు . ఈ మధ్య ఆయన తీసిన ‘నగ్నం’ అనే కళాఖండ లఘుచిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న వర్మ.. అడిగిన వాళ్లను కాదనకుండా వరుస ఇంటర్వ్యూలను ఇస్తున్నాడు. తాజాగా వనిత టీవీతో పాపులర్ అయిన వర్మను ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో ‘అమ్మాయిల్లో బ్యూటీని మీరు లెక్కకట్టేటప్పుడు వేటిని పరిగణలోకి తీసుకుంటారు’ అని వర్మను రెచ్చగొట్టే ప్రశ్న వేసింది చందన. దీంతో వర్మలో ఉన్న కర్మ బయటకు వచ్చేశాడు. ‘బ్యూటీ అంటే షేర్ ఫుల్‌ నెస్’ అనేశాడు వర్మ. నేను ఈ మధ్య కాలంలో చూసిన అమ్మాయిల్లో మోస్ట్ బ్యూటిఫుల్ మీరు.. ఇంత అందమైన మీరు మీడియాలో యాంకర్‌గా టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు. హార్ట్ ఫుల్‌గా చెప్తున్నా.. నువ్ నమ్మినా నమ్మకపోయినా.. నువ్ చాలా బ్యూటిఫుల్. నువ్ ఉండాల్సింది ఇక్కడ కాదు.. సినిమాలో.. నీకు ఎనీటైం నటించాలని అనిపించినా.. నన్ను కాంటాక్ట్ అవ్వు. నీకు వెంటనే ఆఫర్ ఇస్తా. ఇది కెమెరా ముందు చాలా సీరియస్‌గా చెప్తున్నా’ అంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చాడు వర్మ. అయితే వర్మ మాటలకు తెగ సిగ్గుపడిపోయిన యాంకర్ చందన.. టీవీలో కనిపించేవాళ్లు బ్యూటిఫుల్‌గా ఉండొద్దని అంటారా?? అంటూనే.. మీరు అందాన్ని పొగుడుతుంటే నాకు ఇంకొకటి గుర్తువచ్చింది.. చాలా మంది యాంకర్‌ని మీరు ఇలాగే పొగుడుతూ ఉంటారు కదా.. అని ఝలక్ ఇచ్చింది చందన. అంతేకాదు తనకు పెళ్లైందని విషయాన్ని ఇన్ డైరెక్ట్‌గా గుర్తు చేస్తూ.. మీకు హౌస్ వైఫ్ అంటే ఇష్టం ఉండదని అంటారు కదా.. కారణం ఏంటి? అని అడిగింది. నిజమే.. నాకు హౌస్ వైఫ్ అంటే ఇష్టం ఉండదు.. వంట ఇంట్లో చెమటలు పట్టి పనులు చేసే ముఖాలు నాకు ఇష్టం ఉండదు అంటూ పాత పాట పాడారు వర్మ. ‘ఆర్జీవీ అందాన్ని పొగిడితే అదో పెద్ద సర్టిఫికేట్‌గా తీసుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు.. అసలు ఆయనెవరు?? ఆయనకు ఉన్న క్వాలిఫికేషన్ ఏంటి? అనేవాళ్లు ఉన్నారు. వాళ్లకు మీ సమాధానం ఏంటి? అని యాంకర్ ప్రశ్నించడంతో.. నేను కాంప్లిమెంట్ ఇచ్చా.. దానికి క్వాలిఫికేషన్ అవసరం లేదు. అది నా ఒపీనియన్ అంటూ తనదైన శైలిలో ఆన్సర్ ఇచ్చారు వర్మ. మొత్తానికి యాంకర్ చందనతో వర్మ కలిపిన పులిహోర సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3dSNexp

No comments:

Post a Comment

'I Felt Enough Is Enough And Quit The BJP'

'All senior Muslim leaders of the BJP are left behind.' from rediff Top Interviews https://ift.tt/yCEdUhr