Thursday, 2 July 2020

సినిమాలకు బ్రహ్మానందం గుడ్‌ బై! ఇకపై ఆయన జర్నీ అంతా.. అదే జరిగితే!!

బ్రహ్మానందం.. ఈ పేరు వింటే చాలు ఆయన ఎక్స్‌ప్రెషన్స్, కడుపుబ్బా నవ్వించే డైలాగ్స్ ప్రతి ఒక్క ప్రేక్షకుడి మదిలో మెదిలిపోతుంటాయి. కొన్నేళ్లుగా కామెడీకి కేరాఫ్ అడ్రస్ తానే అన్నట్లుగా వెండితెర ప్రయాణం కొనసాగించిన ఈ హాస్య బ్రహ్మ.. ఇకపై సినిమాల్లో నటించబోరని తెలుస్తోంది. సినిమాలకు ఆయన గుడ్ బై చెప్పేశారని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు షికారు చేస్తున్నాయి. అంతేకాదు ఇకపై బుల్లితెర ప్రయాణం కొనసాగించనున్నట్లు చెప్పుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో బ్రహ్మానందం సినిమాలు చేయడం తగ్గించిన విషయం తెలిసిందే. కొత్త కమెడియన్స్ హవా నడుస్తుండటం, పైగా బ్రహ్మి వయసు మీదపడటం.. ఇలా కారణం ఏదైనా కావచ్చు కానీ వెండితెరపై బ్రహ్మి కామెడీ మిస్సయ్యామనే మాట మాత్రం వాస్తవం. మరోవైపు కొత్తవారికి అవకాశం ఇవ్వాలని, ఎప్పుడూ మేమే ఉండాలని కోరుకోవడం సరికాదని కూడా బ్రహ్మానందం పలుమార్లు చెప్పిన సందర్భాలున్నాయి. Also Read: ఈ క్రమంలోనే ఇకపై సినిమాల్లో నటించకూడదని బ్రహ్మి డిసైడ్ అయ్యారట. కాకపోతే ప్రేక్షకలోకానికి పూర్తిగా దూరం కాకూడదనే ఉద్దేశంతో డైలీ సీరియల్‌లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. కామెడీ టచ్ ఇస్తూ తన పాత్రకు అధిక ప్రాధాన్యత ఉండేలా బుల్లితెర దర్శకులు వినిపించిన కొన్ని కథలు బ్రహ్మికి బాగా నచ్చాయట. వాటిపై త్వరలోనే ఆయన నిర్ణయం ప్రకటించనున్నారని బలమైన టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే ప్రేక్షకులకు ఒక రకంగా ఇది గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇకపై ఇంట్లోనే కూర్చొని డైలీ సీరియల్స్‌లో ఎంచక్కా బ్రహ్మి ఎక్స్‌ప్రెషన్స్ చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. సో.. చూడాలి మరి ఈ వార్తలపై బ్రహ్మానందం స్పందన ఎలా ఉంటుందనేది!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ApEgd8

No comments:

Post a Comment

'No Plan To Phase Out Old I-T Regime'

'Going forward, the encouragement would be to move to the new tax regime.' from rediff Top Interviews https://ift.tt/ZqrBWh3