Saturday, 25 July 2020

Bandla Ganesh: 'పవర్ స్టార్'‌కి బండ్ల గణేష్ సపోర్ట్! ఇష్యూ వైరల్ కావడంతో పబ్లిక్‌‌గా సారీ..

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండటం కూడా అంత ఆషామాషీ విషయం కాదు. కొన్ని సందర్భాల్లో తెలియకుండా చేసిన చిన్న పొరపాటు కూడా క్షణాల్లో వైరల్ అయి ఊహించని పరిణామాలకు దారి తీస్తుంటుంది. పవన్ కళ్యాణ్ భక్తుడు, పవన్ వీరాభిమాని అని చెప్పుకునే విషయంలోనూ అదే జరిగింది. అనుకోకుండా రామ్‌గోపాల్ వర్మ చేసిన పోస్ట్‌పై ఆయన స్పందించడంతో ఈ ఇష్యూ చర్చల్లో నిలిచింది. దీంతో చేసేదేమీ లేక తప్పని పరిస్థితుల్లో పబ్లిక్‌గా‌‌ సారీ చెప్పేశారు బండ్ల గణేష్. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ రూపొందించిన `పవర్‌స్టార్` సినిమాపై ఓ రేంజ్ వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా చిరంజీవి, పవన్, త్రివిక్రమ్ శ్రీనివాస్, బండ్ల గణేష్, చంద్రబాబులను పోలిఉన్న నటులను పెట్టి ''ఎన్నికల తర్వాత కథ'' అంటూ సినిమా రూపొందించడం అభిమానుల వ్యతిరేకతను కూడగట్టుకుంది. ఈ పరిస్థితుల్లో 'పవర్ స్టార్' మూవీ నుంచి వర్మ షేర్ చేసిన ఓ ప్రమోషన్ వీడియోను లైక్ చేసి షాకిచ్చారు బండ్ల గణేష్. వర్మ విడుదల చేసిన `బ్రదర్స్ వీడియో`పై ట్విట్టర్‌లో రియాక్ట్ అవుతూ లైక్ కొట్టేశారు బండ్ల గణేష్. ఇంకేముంది ఇది చూసిన పవన్ ఫ్యాన్స్ బండ్ల గణేష్ తీరును తప్పుబట్టారు. ఈ నేపథ్యంలో ఏకంగా ఓ అభిమాని దీని గురించి ట్విటర్ ద్వారా ఆయనను ప్రశ్నించాడు. `అదంతా కాదు బండ్ల అన్నా.. ఈ వీడియోను ఎందుకు లైక్ చేశావ్` అని అడిగాడు. దీంతో బండ్ల గణేష్ వెంటనే స్పందిస్తూ.. ''ఒట్టు.. ఏదో పొరపాటున జరిగి పోయింది. ఇంకెప్పుడూ ఇలాంటి తప్పు చేయను. చేసిన తప్పుకు సారీ చెబుతున్నా'' అని పేర్కొన్నారు. దీంతో ఈ ఇష్యూ నెట్టింట వైరల్ అయింది. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2D6MojA

No comments:

Post a Comment

'Determination Not To Bend Before Aurangzeb'

'...despite all his horses, elephants, tanks and swords.' from rediff Top Interviews https://ift.tt/34xEhrA